PC: BCCI X
సొంతగడ్డపై వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియాకు మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు నాలుగు టీ20లు పూర్తి కాగా.. ఇరుజట్లు 2-2తో సమంగా నిలిచాయి. తొలి మ్యాచ్‌లో గెలిచి భారత్ శుభారంభం అందుకోగా.. మరుసటి మ్యాచ్‌లో విండీస్ గెలిచింది.
ఈ క్రమంలో మూడో మ్యాచ్‌లో గెలిచి టీమిండియా ఆధిక్యంలోకి వెళ్లగా.. తాజాగా బుధవారం నాటి నాలుగో టీ20లో జయభేరి మోగించి కరేబియన్ జట్టు రేసులోకి వచ్చింది. అయితే, హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది.
247 పరుగులు
టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్ ఏకంగా.. 247 పరుగులు సమర్పించుకుంది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటర్లు తడబడటంతో విండీస్.. 24 పరుగుల తేడాతో గెలిచింది. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ టీమిండియా యాజమాన్యం తీరుపై విమర్శలు చేశాడు.
ఓటమికి బౌలర్లదే బాధ్యత
కేవలం ఆల్రౌండర్లను నమ్ముకుని.. స్పెషలిస్టు బౌలర్లను పక్కనపెడితే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నాడు. ఇలాంటి జట్టుతో ప్రపంచకప్ గెలవడం కష్టమేనని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ..
‘‘నాలుగో టీ20లో ఓటమికి టీమిండియా బౌలర్లదే బాధ్యత. వాళ్ల వైఫల్యం కారణంగానే జట్టు పరాజయం పాలైంది. ఇది నూటికి నూరుపాళ్లు నిజం. 247 పరుగులు ఇవ్వడం అంటే మాటలు కాదు. చెత్తగా బౌలింగ్ చేసినందు వల్లే మనం ఓడిపోయాము.
కొండంత లక్ష్యం ఉన్నపుడు.. ఇలాంటి ఫలితాలను ముందుగానే ఊహించవచ్చు. అయినా ఇలా ఓడిపోవడం ఇదేమీ మొదటిసారి కాదు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో సాధారణంగా బ్యాటర్లు మూడు మ్యాచ్‌లు గెలిపిస్తే.. కనీసం రెండు మ్యాచ్‌లలోనైనా బౌలర్లు బాధ్యత తీసుకోవాలి.
ఇలాంటి కాంబినేషన్‌తో ప్రపంచకప్ గెలవడం అసాధ్యం
కానీ మన బౌలర్లు ఒక్క మ్యాచ్ కూడా గెలిపించలేకపోతున్నారు. ఇలాంటి కాంబినేషన్‌తో ప్రపంచకప్ గెలవడం అస్సలు సాధ్యపడదు’’ అని మహ్మద్ కైఫ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా విండీస్‌తో నాలుగో టీ20లో ముగ్గురు పేసర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్లతో టీమిండియా బరిలోకి దిగింది.
BREAKTHROUGH WHEN INDIA NEEDED IT MOST! 💪 #PrinceYadav with a game-changing caught & bowled to break the flow and send #ShimronHetmyer back! #INDvWI 4th T20I | LIVE NOW 👉 https://t.co/u6TUkXnpvZ https://t.co/piPnGp3LU2
— Star Sports (@StarSportsIndia) October 14, 2026
పేసర్లలో మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి ఇద్దరూ 52 పరుగుల చొప్పున సమర్పించుకున్నారు. ప్రిన్స్ యాదవ్ 36 పరుగులు ఇచ్చుకోగా.. ఆల్రౌండర్లలో అక్షర్ పటేల్ నాలుగు ఓవర్లు వేసి 45, నమన్ ధిర్ ఒక్క ఓవర్లోనే 19, నితీశ్ కుమార్ రెడ్డి మూడు ఓవర్లలో 39 పరుగులు ఇచ్చారు. స్పెషలిస్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గత రెండు మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితమయ్యాడు.
చదవండి: IND vs WI: నీకసలు మానవత్వం, క్రీడాస్ఫూర్తి లేవా?: టీమిండియా దిగ్గజం ఫైర్


