హోప్ (PC: WI Cricket X)
టీమిండియాతో నాలుగో టీ20లో వెస్టిండీస్ భారీ స్కోరు సాధించింది. హైదరాబాద్ వేదికగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి ఏకంగా 247 పరుగులు చేసింది. కెప్టెన్ షాయీ హోప్ 50 బంతుల్లో సెంచరీ చేశాడు.
హెట్‌మైర్ మెరుపులు
ఉప్పల్ స్టేడియంలో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. విండీస్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో జువెల్ ఆండ్రూ (16 బంతుల్లో 21) వేగంగా ఆడే క్రమంలో అక్షర్ పటేల్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్, కెప్టెన్ షాయీ హోప్‌నకు తోడైన షిమ్రన్ హెట్‌మైర్ మెరుపులు (12 బంతుల్లో 33) మెరిపించాడు.
BREAKTHROUGH WHEN INDIA NEEDED IT MOST! 💪 #PrinceYadav with a game-changing caught & bowled to break the flow and send #ShimronHetmyer back! #INDvWI 4th T20I | LIVE NOW 👉 https://t.co/u6TUkXnpvZ https://t.co/piPnGp3LU2
— Star Sports (@StarSportsIndia) October 14, 2026
రూథర్‌ఫర్డ్ ధనాధన్
హోప్‌తో కలిసి రెండో వికెట్‌కు 24 బంతుల్లో 58 పరుగులు జోడించాడు. ఇక రోవ్‌మన్ పావెల్ (17 బంతుల్లో 24) ఫర్వాలేదనిపించగా.. హోప్‌తో కలిసి షెర్ఫానే రూథర్‌ఫర్డ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 43 బంతుల్లో 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
శతక్కొట్టిన హోప్
ఈ క్రమంలో రూథర్‌ఫర్డ్ 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక హోప్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్సర్ బాది శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 50 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 4 ఫోర్లు, 9 సిక్సర్లు బాది 102 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
కాగా హోప్‌నకు ఈ సిరీస్‌లో ఇది రెండో సెంచరీ కావడం విశేషం. అంతేకాదు ఈ సెంచరీతో అతడు అంతర్జాతీయ పొట్టి క్రికెట్లో రెండు వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఇక భారత బౌలర్లలో అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.


