Video: Kohli Dismissed Cheaply By Unadkat In Practice Match - Sakshi
Sakshi News home page

Virat Kohli: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్‌! వీడియో వైరల్‌

Jul 6 2023 12:45 PM | Updated on Jul 6 2023 1:33 PM

Ind Vs WI 2023: Kohli Dismissed Cheaply By Jaydev Unadkat Video - Sakshi

విరాట్‌ కోహ్లి (ఫైల్‌ ఫొటో)

Ind Vs WI Test Series 2023: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌-2023 ఫైనల్‌ అనంతరం టీమిండియా.. దాదాపు 20 రోజుల విశ్రాంతి తర్వాత కరేబియన్‌ దీవికి చేరుకుంది. జూలై 12 నుంచి వెస్టిండీస్‌తో మొదలుకానున్న టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సహా టెస్టులకు ఎంపికైన జట్టు మొత్తం ఇప్పటికే విండీస్‌లో అడుగుపెట్టింది.

ఈ క్రమంలో భారత ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. ఇందులో భాగంగా రెండు జట్లుగా విడిపోయి ప్రాక్టీసులో తలమునకలయ్యారు. బార్బడోస్‌ వేదికగా సాగిన ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.

విఫలమైన కోహ్లి
టీమిండియా లెఫ్టార్మ్‌ పేసర్‌ జయదేవ్‌ ఉనాద్కట్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్‌ ఇచ్చి వికెట్‌ పారేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారగా.. ‘‘కోహ్లి.. మరీ ఇంత ఈజీగా అవుట్‌ అయ్యాడా?’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కాగా టెస్టుల్లో మంచి రికార్డు కలిగి ఉన్న కోహ్లి.. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 ముందు వరకు సెంచరీ సాధించలేకపోయాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో మ్యాచ్‌ సందర్భంగా మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ వెయ్యి రోజుల తర్వాత శతకం బాది తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. అయితే, ఆ తర్వాత స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు.

విండీస్‌ గడ్డపై ఎలా ఆడతాడో?
ఇక ఇటీవల ఇంగ్లండ్‌ వేదికగా ఆసీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఓవల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోహ్లి రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా.. 14, 49 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ సైకిల్‌ 2023-25లో భాగంగా మొట్టమొదటి మ్యాచ్‌(విండీస్‌తో)లో ఎలా ఆడతాడో అన్న ఆసక్తి నెలకొంది.

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన భారత ఆటగాళ్లు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్‌ కెప్టెన్‌), కేఎస్ భరత్ (వికెట్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్‌ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్‌, నవదీప్ సైనీ.

చదవండి: ఎలక్ట్రీషియన్ కుటుంబంలో పుట్టి టీమిండియాలోకి.. హ్యాట్సాఫ్‌ తిలక్ వర్మ!
టెస్టుల్లో స్టీవ్‌ స్మిత్‌ను మించినోడే లేడు.. బౌలర్‌గా మొదలుపెట్టి అత్యున్నత శిఖరాలకు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement