టీమిండియాతో తొలి టెస్టు.. దక్షిణాఫ్రికాకు బిగ్‌ షాక్‌ | Sakshi
Sakshi News home page

IND vs SA 1st Test: టీమిండియాతో తొలి టెస్టు.. దక్షిణాఫ్రికాకు బిగ్‌ షాక్‌

Published Tue, Dec 26 2023 6:41 PM

IND vs SA: Temba Bavuma taken for scans, unlikely to take further part in Day 1s play - Sakshi

సెంచూరియన్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.  ఆ జట్టు కెప్టెన్‌ టెంబా బావుమా తొలి రోజు ఆట సందర్భంగా గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో బావుమా తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విల్లావిల్లాడు. ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికీ నొప్పి ఎక్కువగా ఉండడంతో అతడు మైదానాన్ని వీడాడు.

అయితే వెంటనే అతడిని స్కానింగ్‌ తరిలించినట్లు తెలుస్తోంది. అతడు బ్యాటింగ్‌కు కూడా వచ్చే సూచనలు కన్పించడం లేదు. ప్రస్తుతం ప్రోటీస్‌ స్టాండింగ్‌ కెప్టెన్‌ వెటరన్‌ ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ వ్యవహరిస్తున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ బౌలర్లను ఎదుర్కొవడానికి భారత బ్యాటర్లు కష్టపడుతున్నారు. 50 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా పేసర్‌ రబాడ ఐదు వికెట్లతో చెలరేగాడు.

Advertisement
Advertisement