PC: BCCI/X
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో సంజూ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 226 పరుగుల భారీ లక్ష్య చేధనలో శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ హ్యాగ్లీ ఓవల్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో శాంసన్ కేవలం 23 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా న్యూజిలాండ్ గడ్డపై భారత తరపున ఫాస్టెస్ట్ టీ20 హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా సంజూ రికార్డులకెక్కాడు.
అంతకుముందు ఈ రికార్డు రోహిత్ శర్మ(28) పేరిట ఉండేది. తాజా నాక్‌తో రోహిత్ ఆల్‌టైమ్ రికార్డును శాంసన్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 33 బంతులు ఎదుర్కొన్న శాంసన్ 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67 పరుగులు చేసి ఔటయ్యాడు.
అదేవిధంగా మరో రికార్డును శాంసన్ తన పేరిట లిఖించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఈయర్‌లో టీ20ల్లో అత్యధిక సార్లు ఏభైకి పైగా పరుగులు సాధించిన నాలుగో భారత ప్లేయర్‌గా సంజూ నిలిచాడు. ఈ సీఎస్‌కే వికెట్ కీపర్ బ్యాటర్ ఈ ఏడాది అంతర్జాతీయ టీ20ల్లో 8 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు.
చదవండి: IND vs NZ: అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు


