Ind Vs Aus 4th Test Day 4: కోహ్లి డబుల్‌ సెంచరీ మిస్‌.. 88 పరుగుల ఆధిక్యంలో భారత్‌

Ind Vs Aus 4th Test Day 4 Ahmedabad Updates And Highlights - Sakshi

India vs Australia, 4th Test Day 4 Updates: 

కోహ్లి డబుల్‌ సెంచరీ మిస్‌.. 88 పరుగుల ఆధిక్యంలో భారత్‌ 
186 పరుగుల వద్ద కోహ్లి ఔటవ్వగానే టీమిండియా 571/9 స్కోర్‌ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిం‍ది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 3 పరుగులు పరుగులు చేసి, ఇంకా 88 పరుగులు వెనుకపడి ఉంది. ట్రవిస్‌ హెడ్‌ (3), మాథ్యూ కుహ్నేమన్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. 

అంతకుముందు భారత ఇన్నింగ్స్‌లో కోహ్లితో పాటు శుభ్‌మన్‌ గిల్‌ (128) సెం‍చరీ చేయగా..  అక్షర్‌ పటేల్‌ (79) మెరుపు అర్ధసెంచరీతో అలరించాడు. దానికి ముందు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 482 పరుగులకు ఆలౌటైంది. 

ఉస్మాన్‌ ఖ్వాజా (180), గ్రీన్‌ (114) సెంచరీలతో కదం‍తొక్కగా.. అశ్విన్‌ 6 వికెట్లతో ఆసీస్‌ వెన్ను విరిచాడు. ఆసీస్‌ బౌలర్లలో లియోన్‌, మర్ఫీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్‌, కుహ్నేమన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. 

కోహ్లి డబుల్‌ సెంచరీ మిస్‌.. ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసిన భారత్‌
186 పరుగుల వద్ద కోహ్లి ఔట్‌ కావడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను 571 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. మర్ఫీ బౌలింగ్‌లో లబూషేన్‌ను క్యాచ్‌ ఇచ్చి కోహ్లి వెనుదిరిగాడు. గాయం కావడంతో శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌కు దిగలేదు. ప్రస్తుతం భారత్‌ 91 పరుగుల ఆధిక్యం‍లో కొనసాగుతోంది. 

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌..కోహ్లి డబుల్‌ సెంచరీ చేసేనా..?
జట్టు స్కోర్‌ 555/5 వరకు సాఫీగా సాగిన భారత ప్రయాణం.. ఆతర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో పరిస్థితి తారుమారైంది. అక్షర్‌ను (79) స్టార్క్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేయగా.. 568 పరుగుల వద్ద ఆశ్విన్‌ను (7) లియోన్‌ బోల్తా కొట్టించాడు.   567 పరుగుల వద్ద కోహ్లి పిలుపు మేరకు అనవసరమైన రెండో పరుగుకు ప్రయత్నించిన ఉమేశ్‌ (0) రనౌటయ్యాడు. ఈ నేపథ్యంలో 185 పరుగుల వద్ద బ్యాటింగ్‌ కొనసాగిస్తున్న కోహ్లి డబుల్‌ సెంచరీ చేయగలడా లేదా అని​ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.  

ఆరో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. అక్షర్‌ పటేల్‌ క్లీన్‌ బౌల్డ్‌
555 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్‌ కోల్పోయింది. స్టార్క్‌ బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్‌ (79) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. విరాట్‌ కోహ్లి (177), అశ్విన్‌ క్రీజ్‌లో ఉన్నారు.

169 ఓవర్లలో టీమిండియా స్కోరు: 529/5
కోహ్లి 169, అక్షర్‌ 61 పరుగులతో క్రీజులో ఉన్నారు.

అక్షర్‌ పటేల్‌ హాఫ్‌ సెంచరీ
167.1: టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ అర్ధ వతకం సాధించాడు. కోహ్లితో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు.

500 పరుగులు మార్కు అందుకున్న టీమిండియా
కోహ్లి 154, అక్షర్‌ పటేల్‌ 47 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్‌ కంటే 20 పరుగుల ఆధిక్యంలోకి దూసుకొచ్చింది.

టీ బ్రేక్‌ సమయానికి టీమిండియా స్కోరు: 472/5 (158)
కోహ్లి 135, అక్షర్‌ పటేల్‌ 38 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్‌ కంటే టీమిండియా ఇంకా 8 పరుగులు వెనుకబడి ఉంది.

కోహ్లి 28వ టెస్టు సెంచరీ
టెస్టుల్లో కోహ్లి 28వ శతకం.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓవరాల్‌గా 75వ సెంచరీ సాధించాడు. ఇక కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియా 400 పరుగుల మార్కు దాటింది.

ఐదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
136.4: అయ్యో భరత్‌
నాథన్‌ లియోన్‌ బౌలింగ్‌లో టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎస్‌ భరత్‌ అవుటయ్యాడు. అంతర్జాతీయ కెరీర్‌లో తొలి అర్ధ శతకానికి ఆరు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.  44 పరుగులు సాధించి పెవిలియన్‌ చేరాడు. దీంతో టీమిండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. స్కోరు: 393-5

లంచ్‌ బ్రేక్‌ సమయానికి టీమిండియా స్కోరు: 362/4 (131)
విరాట్‌ కోహ్లి 88, కేఎస్‌ భరత్‌ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్‌ కంటే టీమిండియా ఇంకా 118 పరుగులు వెనుకబడి ఉంది.

80 పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లి
టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, కేఎస్‌ భరత్‌తో నిలకడగా ఆడుతున్నారు. ఈ క్రమంలో కోహ్లి 127 ఓవర్లు ముగిసే సరికి 81 పరుగులతో క్రీజులో ఉండగా.. భరత్‌ 21 పరుగులు చేశాడు. టీమిండియా ప్రస్తుత స్కోరు- 346/4 (127)

డ్రింక్స్‌ బ్రేక్‌ సమయానికి టీమిండియా స్కోరు:  323-4(116)
106.6: నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌
ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా రూపంలో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఆసీస్‌ స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీ బౌలింగ్‌లో ఖవాజాకు క్యాచ్‌ ఇచ్చి 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడ్డూ నిష్క్రమించాడు. కోహ్లి (67), కేఎస్‌ భరత్‌ క్రీజులో ఉన్నారు.

300 పరుగుల మార్కు అందుకున్న టీమిండియా
106 ఓవర్లలో భారత్‌ స్కోరు: 303-3

నాలుగో రోజు ఆట ఆరంభం
టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్‌ టెస్టులో నాలుగో రోజు ఆట మొదలైంది. భారత ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా బ్యాటింగ్‌ కొనసాగిస్తున్నారు. కాగా 99 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 289 పరుగుల వద్ద రోహిత్‌ సేన శనివారం నాటి మూడో రోజు ఆట ముగించింది. శుబ్‌మన్‌ గిల్‌ 128 పరుగులతో రాణించగా.. కోహ్లి హాఫ్‌ సెంచరీ సాధించి మూడోరోజు భారత్‌కు అనుకూలంగా మార్చారు.

బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ ఆఖరి టెస్టు
తుది జట్లు
టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ.

ఆస్ట్రేలియా
ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్ (కెప్టెన్‌), పీటర్ హ్యాండ్స్‌కాంబ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్‌ కీపర్‌), మిచెల్ స్టార్క్, మాథ్యూ కుహ్నెమాన్, టాడ్ మర్ఫీ, నాథన్ లియోన్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top