ICC T20 Rankings: India set to remain No.1 - Sakshi
Sakshi News home page

T20I Team Rankings: వరల్డ్‌కప్‌ గెలవకపోయినా, టీమిండియానే నంబర్‌ 1

Nov 14 2022 2:53 PM | Updated on Nov 14 2022 3:18 PM

ICC T20I Team Rankings After T20 WC 2022, Team India Remains Top - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 ముగిసిన అనంతరం ఐసీసీ విడుదల చేసిన టీ20 టీమ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. వరల్డ్‌కప్‌లో సెమీస్‌లోనే నిష్క్రమించినా.. రోహిత్‌ సేన అగ్రస్థానాన్ని కాపాడుకోగలిగింది. పొట్టి ఫార్మాట్‌లో గత కొంతకాలంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత జట్టు.. ప్రస్తుతం 268 రేటింగ్‌ పాయింట్స్‌తో నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. వరల్డ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌ జట్టు టీమిండియా తర్వాత రెండో స్థానంలో కొనసాగుతుంది.

ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 265 పాయింట్లు ఉన్నాయి. వరల్డ్‌కప్‌కు ముందు వరకు భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య అంతరం చాలానే ఉన్నప్పటికీ.. వరల్డ్‌కప్‌ గెలుపుతో ఇంగ్లండ్‌.. టీమిండియా టాప్‌ ప్లేస్‌ దిశగా దూసుకొస్తుంది. ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య 3 పాయింట్ల తేడా మాత్రమే ఉంది. ఇక వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్‌ సైతం పాయింట్లను బాగా మెరుగుపర్చుకుని మూడో స్థానానికి ఎగబాకింది.

పాక్‌ ఖాతాలో 258 పాయింట్లు ఉన్నాయి. పాక్‌ తర్వాత సౌతాఫ్రికా (256), న్యూజిలాండ్‌ (253), ఆస్ట్రేలియా (252), వెస్టిండీస్‌ (236), శ్రీలంక (235), బంగ్లాదేశ్‌ (222), ఆఫ్ఘనిస్తాన్‌ (217) జట్లు వరుసగా 4 నుంచి 10 స్థానాల్లో ఉన్నాయి. టీ20 బ్యాటర్ల విషయానికొస్తే.. సూర్యకుమార్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, డెవాన్‌ కాన్వే తొలి మూడు స్థానాల్లో ఉండగా, బౌలింగ్‌లో హసరంగ, రషీద్‌ ఖాన్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌ టాప్‌-3లో, ఆల్‌రౌండర్ల విభాగంలో షకీబ్‌ అల్‌ హసన్‌, మహ్మద్‌ నబీ, హార్ధిక్‌ పాండ్యా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. 
చదవండి: Wasim Jaffer: సూర్యకుమార్‌ కీలక మ్యాచ్‌ల్లో చేతులెత్తేశాడు.. !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement