ICC Rankings: Error On ICC Website Results In India Replacing Australia At Top In Test Rankings - Sakshi
Sakshi News home page

భారత్‌ నంబర్‌వన్‌... కాదు కాదు నంబర్‌ 2

Published Thu, Feb 16 2023 5:07 AM

Icc Error On Website Result India Replacing Australia At Top In Test Rankings - Sakshi

దుబాయ్‌: టెస్ట్‌ టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ రెండో ర్యాంక్‌ నుంచి నంబర్‌వన్‌ ర్యాంక్‌కు ఎగబాకిందని ఐసీసీ బుధవారం మధ్యాహ్నం ప్రకటించింది. దాంతో ఇప్పటికే వన్డే, టి20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న భారత్‌ టెస్టుల్లోనూ టాప్‌ ర్యాంక్‌ అందుకోవడంతో ఏకకాలంలో మూడు ఫార్మాట్‌లలో (టెస్టు, వన్డే, టి20) టీమిండియా నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచిందని అభిమానులు సంబరపడ్డారు.

అయితే భారత్‌ ఇంకా టాప్‌ ర్యాంక్‌కు చేరుకోలేదని... రెండో ర్యాంక్‌లోనే కొనసాగుతోందని... తమ రేటింగ్‌ పాయింట్ల లెక్కల్లో తప్పిదంతో ఈ గందరగోళం చోటు చేసుకుందని బుధవారం రాత్రి ఐసీసీ వివరణ ఇచ్చింది. ప్రస్తుత టెస్టు ర్యాంకింగ్స్‌ లో ఆ్రస్టేలియా 126 రేటింగ్‌తో టాప్‌ ర్యాంక్‌లో, భారత్‌ 115 రేటింగ్‌తో రెండో ర్యాంక్‌లో ఉన్నాయి.

Advertisement
Advertisement