చెలరేగిన కొలిన్‌ మున్రో​.. చేతులెత్తేసిన మలాన్‌, హేల్స్‌, రూట్‌ 

The Hundred League: Munro Slams Blasting Fifty, As Trent Rockets Defeat Welsh Fire - Sakshi

హండ్రెడ్‌ లీగ్‌-2023లో భాగంగా వెల్ష్‌ ఫైర్‌తో నిన్న (ఆగస్ట్‌ 14) జరిగిన మ్యాచ్‌లో ట్రెంట్‌ రాకెట్స్‌ 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాకెట్స్‌.. కొలిన్‌ మున్రో మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. మున్రో మినహా రాకెట్స్‌ ఇన్నింగ్స్‌లో అంతా విఫలమయ్యారు. రాకెట్స్‌ టీమ్‌లో డేవిడ్‌ మలాన్‌ (10), అలెక్స్‌ హేల్స్‌ (4), జో రూట్‌ (14), డేనియల్‌ సామ్స్‌ (17) లాంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నా ఆ జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. వెల్ష్‌ ఫైర్‌ బౌలర్లలో డేవిడ్‌ విల్లే, జేక్‌ బాల్‌, వాన్‌ డర్‌ మెర్వ్‌  తలో 2 వికెట్లు పడగొట్టారు.

రాణించిన జో క్లార్క్‌..
153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెల్ష్‌ఫైర్‌.. 6 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. జో క్లార్క్‌ (54), కెప్టెన్‌ టామ్‌ ఎబెల్‌ (32) వెల్ష్‌ఫైర్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. వెల్ష్‌ ఫైర్‌ స్టార్‌ ఆటగాళ్లు జానీ బెయిర్‌స్టో (9 బంతుల్లో 3), గ్లెన్‌ ఫిలప్స్‌ (12) విఫలమయ్యారు. స్టెఫెన్‌ ఎస్కినాజీ (25) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. రాకెట్స్‌ బౌలర్లలో డేనియల్‌ సామ్స్‌ 2, జాన్‌ టర్నర్‌, ఐష్‌ సోధి తలో వికెట్‌ పడగొట్టారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top