Ind vs WI: జట్టు కోసం ఎంతో చేశాడు.. కానీ పాపం! వాళ్లు కూడా విఫలమయ్యారు.. అయినా..

He Did Dirty Work But Harbhajan Singh Takes Indirect Dig At Kohli - Sakshi

Ind Vs WI 2023 Test Series: ‘‘అన్ని రకాల గౌరవాలు పొందేందుకు అతడు నూటికి నూరు శాతం అర్హుడు. అలాంటిది తనను జట్టు నుంచి తప్పించడం నాకు ఆశ్చర్యంగా ఉంది. నిజానికి డబ్ల్యూటీసీ ఫైనల్లో అతనొక్కడే విఫలం కాలేదు కదా! అదే జట్టులో ఉన్న చాలా మంది కూడా కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేదు. పుజారా మాదిరే వాళ్లు కూడా పరుగులు సాధించడంలో వైఫల్యం చెందారు.

స్ట్రైక్‌రేటు అంతంత మాత్రంగా ఉండటానికి కారణమదే
చాలా మంది టెస్టుల్లో పుజారా స్ట్రైక్‌రేటు గురించిన విమర్శలు చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. వాస్తవానికి పుజారా స్ట్రైక్‌రేటు అంతంత మాత్రంగా ఉండటానికి కారణం.. సహచర ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టినపుడు వికెట్‌ పడకుండా చూసుకోవడం.. జట్టును ఆదుకునే వాళ్లకు సపోర్టు ఇవ్వడం వల్లే! ఎన్నో విజయాల్లో పుజారా కీలక పాత్ర పోషించాడు.

కానీ అతడికి దక్కాల్సినంత గౌరవం దక్కలేదు. జట్టుకు ఇప్పుడు కూడా తన అవసరం ఎంతగానో ఉంది. కానీ అనూహ్య రీతిలో పక్కనపెట్టారు. ముఖ్యంగా SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) గడ్డ మీద జట్టుకు ఇలాంటి ఆటగాడు అవసరం.

వాళ్లను మాత్రం పక్కన పెట్టరు?!
ఎవరైనా సరే ప్రతిసారి అద్భుతంగా ఆడలేరు కదా! పుజారా లాంటి టెస్టు క్రికెటర్‌ను వదులుకుంటే నష్టపోవాల్సి ఉంటుంది’’ అంటూ టీమిండియా మాజీ బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌.. ఛతేశ్వర్‌ పుజారాకు అండగా నిలబడ్డాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో పుజారాను తప్పించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌-2023లో టీమిండియా ఘోర ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌లోని ఓవల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. బ్యాటర్ల వైఫల్యమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(15, 43), శుబ్‌మన్‌ గిల్‌(13, 18) ఆకట్టుకోలేకపోయారు.

స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన కోహ్లి
వన్‌డౌన్‌లో వచ్చిన పుజారా చేసిన పరుగులు 14, 27. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన విరాట్‌ కోహ్లి(14, 49) కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. అజింక్య రహానే మొత్తంగా 138 పరుగులతో టీమిండియా టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు అతడు వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. అనూహ్యంగా పుజారాకు చోటే దక్కలేదు. 

ఈ నేపథ్యంలో మాజీ స్పిన్నర్‌ భజ్జీ స్పందిస్తూ పుజారాకు జట్టులో చోటు ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టాడు. ముఖ్యంగా కోహ్లి, ఇతర బ్యాటర్లను టార్గెట్‌ చేస్తూ.. పుజారాకు అండగా నిలిచాడు. కాగా జూలై 12 నుంచి టీమిండియా- విండీస్‌ మధ్య డొమినికా వేదికగా తొలి టెస్టు ఆరంభం కానుంది.

చదవండి: రాయుడు రిటైర్‌ అయ్యాడు.. మీకు తప్పకుండా జట్టులో చోటిస్తాం.. కానీ: ధోని
సిక్సర్ల రింకూ.. ఎక్కడా తగ్గేదేలే! వీడియోతో సెలక్టర్లకు దిమ్మతిరిగేలా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top