ప్రిక్వార్టర్‌ ఫైనల్లో హరిహరన్‌–అర్జున్‌ జోడీ | Hariharan and Arjun pair in pre quarterfinals | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో హరిహరన్‌–అర్జున్‌ జోడీ

Jun 10 2026 2:59 AM | Updated on Jun 10 2026 2:59 AM

Hariharan and Arjun pair in pre quarterfinals

సిడ్నీ: ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో హరిహరన్‌–ఎంఆర్‌ అర్జున్‌ (భారత్‌) జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో హరిహరన్‌–అర్జున్‌ ద్వయం 21–13, 21–13తో ఆర్డెన్‌ క్వాన్‌ లీ–స్టాన్లీ జింగ్‌ (అమెరికా) జంటను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. మరో డబుల్స్‌ మ్యాచ్‌లో దొడ్డవరపు అచ్యుతాదిత్య రావు–పోచాన అర్జున్‌ రెడ్డి (భారత్‌) జోడీ 15–21, 15–21తో ఇగావా–ఊయ్‌ యి హెర్న్‌ (ఆ్రస్టేలియా) జంట చేతిలో ఓడిపోయింది. 

పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్‌ సనీత్‌ దయానంద్‌ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లో సనీత్‌ 21–17, 21–15తో కరోనో (ఆస్ట్రేలియా)పై, రెండో రౌండ్‌లో 21–9, 21–16తో మింగ్‌ హాంగ్‌ లిమ్‌ (మలేసియా)పై గెలిచాడు. భారత్‌కే చెందిన మన్‌రాజ్‌ క్వాలిఫయింగ్‌ రెండో రౌండ్‌లో 11–21, 18–21తో ఇగోని ఇవి (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement