World table tennis: సింగిల్స్‌ విజేత హన్సిని | Hansini Rajan wins fourth WTT Contender title | Sakshi
Sakshi News home page

World table tennis: సింగిల్స్‌ విజేత హన్సిని

Aug 25 2022 12:57 PM | Updated on Aug 25 2022 12:59 PM

Hansini Rajan wins fourth WTT Contender title - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) యూత్‌ కంటెండర్‌ టీటీ టోర్నీలో భారత క్రీడాకారిణులు అదరగొట్టారు. మూడు సింగిల్స్‌ విభాగాల్లో టైటిల్స్‌ గెల్చుకున్నారు. ఈక్వెడార్‌లో జరిగిన ఈ టోర్నీలో తమిళనాడుకు చెందిన హన్సిని మథన్‌ రాజన్‌ అండర్‌–13 బాలికల సింగిల్స్‌ విభాగంలో విజేతగా నిలిచింది.

ఫైనల్లో హన్సిని 11–7, 11–8, 11–7తో మరియానా రోడ్రిగెజ్‌ (ఈక్వెడార్‌)పై గెలిచింది. అండర్‌–19 బాలికల సింగిల్స్‌ విభాగంలో యశస్విని, అండర్‌–17 బాలికల సింగిల్స్‌ విభాగంలో సుహానా సైనీ కూడా టైటిల్స్‌ సాధించారు.  

Advertisement
 
Advertisement
Advertisement