సాక్షి, సికింద్రాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వైఫల్యం మరోసారి బయటపడింది. జింఖానా మైదానం వద్ద అండర్ 14 సెలక్షన్ కోసం క్రికెట్ క్రీడాకారులు బారులు తీరారు. ఉదయం నుంచి వీరిని ఎండలో నిల్చోబెట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) సెలక్షన్ సభ్యులు చోద్యం చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. కనీసం గ్రౌండ్‌లోకి కూడా అనుమతించకుండా రోడ్డుపై ఎండలో నిల్చోబెట్టారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ యాజమాన్యం తమకేమీ పట్టదన్నట్లు చోద్యం చూస్తూ ఉండిపోవడం గమనార్హం.


