ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న విండీస్‌ స్పిన్నర్‌ | Gudakesh Motie And Chamari Athapaththu Wins ICC Player Of The Month May 2024 | Sakshi
Sakshi News home page

ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న విండీస్‌ స్పిన్నర్‌

Jun 13 2024 7:50 PM | Updated on Jun 13 2024 8:15 PM

Gudakesh Motie And Chamari Athapaththu Wins ICC Player Of The Month May 2024

విండీస్‌ స్పిన్నర్‌ గుడకేశ్‌ మోటీ ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును అందుకున్నాడు. 2024 మే నెలకు గానూ మోటీని ఈ అవార్డు వరించింది. ఈ అవార్డు కోసం మోటీతో పాటు పాకిస్తాన్‌ స్పీడ్‌స్టర్‌ షాహిన్‌ అఫ్రిది, ఐర్లాండ్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ లోర్కాన్‌ టక్కర్‌ పోటీపడ్డారు. ముగ్గురిలో మోటీకే అత్యధిక ఓట్లు రావడంతో ఐసీసీ అతన్ని ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌గా ప్రకటించింది. 

మోటీ గడిచిన నెలలో స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లో మోటీ మూడు మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాను క్లీన్‌ స్వీప్‌ చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. మరోవైపు షాహిన్‌ అఫ్రిది గడిచిన నెలలో జరిగిన ఐర్లాండ్‌, ఇంగ్లండ్ పర్యటనల్లో 14.5 సగటున 10 వికెట్లు (టీ20ల్లో) పడగొట్టాడు. లోర్కాన్‌ టక్కర్‌ విషయానికొస్తే.. ఈ ఐరిష్‌ బ్యాటర్‌ మే నెలలలో ఆడిన ఆరు ఇన్నింగ్స్‌ల్లో 37.83 సగటున 227 పరుగులు చేశాడు. ఇందులో ఓ ఫిఫ్టి, నాలుగు 40 ప్లస్‌ స్కోర్లు ఉన్నాయి.

మహిళల విభాగంలో ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ (మే) విషయానికొస్తే.. ఈ అవార్డు కోసం శ్రీలంక స్టార్‌ బ్యాటర్‌ చమారీ ఆటపట్టు, ఇంగ్లండ్‌ సోఫీ ఎక్లెస్టోన్‌, స్కాట్లాండ్‌ బౌలర్‌ కేథరీన్‌ బ్రైస్‌ పోటీపడగా.. మే నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గానూ చమారీనే ఈ అవార్డు వరించింది. చమారీ మే నెలలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 37.75 సగటున 151 పరుగులు చేసి బౌలింగ్‌లో ఆరు వికెట్లు పడగొట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement