క్వార్టర్స్‌లో సింధు | French Open Badminton: PV Sindhu Enter Quarterfinals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సింధు

Oct 29 2021 5:44 AM | Updated on Oct 29 2021 5:44 AM

French Open Badminton: PV Sindhu Enter Quarterfinals - Sakshi

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్లో ప్రవేశించింది. మహిళల సింగిల్స్‌ విభాగంలో గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సింధు 21–19, 21–9తో క్రిస్టోఫర్‌సెన్‌ (డెన్మార్క్‌)పై అద్భుత విజయాన్ని సాధించింది. తొలి గేమ్‌లో 0–5తో వెనుకబడిన సింధు అనంతరం తేరుకొని ఆ గేమ్‌ను సొంతం చేసుకుంది.

ఇక రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆమె గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్‌ (భారత్‌) 21–17, 21–13తో లో కీన్‌ య్యూ (సింగపూర్‌)పై నెగ్గాడు. హిరెన్‌ రుస్తావిటో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్‌ నుంచి సమీర్‌ వర్మ (భారత్‌) గాయంతో మధ్యలోనే వైదొలిగాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ రెండో రౌండ్‌లో భారత ద్వయం అశ్విని పొన్నప్ప–సాత్విక సాయిరాజ్‌ 21–15, 17–21, 19–21తో రెండో సీడ్‌ మెలాటి ఒక్తవియాంటి–ప్రవీణ్‌ జొర్డాన్‌ (ఇండోనేసియా) జంట చేతిలో పోరాడి ఓడింది.   

Advertisement
 
Advertisement
Advertisement