ఫ్రెంచ్‌ ఓపెన్‌ ‘డ్రా’ విడదుల.. ఒకే పార్శ్వంలో అల్‌కరాజ్, జొకోవిచ్‌

French Open 2023 Draw Released - Sakshi

French Open 2023: టెన్నిస్‌ సీజన్‌ రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫ్రెంచ్‌ ఓపెన్‌ ‘డ్రా’ వివరాలను గురువారం విడుదల చేశారు. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాఫెల్‌ నాదల్‌ గాయం కారణంగా తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఈసారి కొత్త చాంపియన్‌ అవతరిస్తాడా లేక మాజీ విజేత జొకోవిచ్‌ మూడోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలుస్తాడా వేచి చూడాలి.

పురుషుల సింగిల్స్‌ ‘డ్రా’ ప్రకారం టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌), మూడో సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా) ఒకే పార్శ్వంలో ఉన్నారు. దాంతో వీరిద్దరు ఫైనల్లో కాకుండా సెమీఫైనల్లోనే తలపడే అవకాశముంది. మరో పార్శ్వం నుంచి రెండో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా), నాలుగో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే), ఆరో సీడ్‌ హోల్గర్‌ రూనె (డెన్మార్క్‌), ఎనిమిదో సీడ్‌ జానిక్‌ సినెర్‌ (ఇటలీ)లలో ఇద్దరు సెమీఫైనల్‌ చేరుకుంటారు.

మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌)కు టాప్‌ సీడింగ్‌ కేటాయించారు. గత ఏడాది రన్నరప్‌ కోకో గాఫ్‌ (అమెరికా)కు ఆరో సీడ్‌ దక్కడంతో క్వార్టర్‌ ఫైనల్లో ఆమెకు స్వియాటెక్‌ ఎదురయ్యే చాన్స్‌ ఉంది. ఆదివారం ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీ మొదలవుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top