నేడు భారత్, జింబాబ్వే మహిళల జట్ల మధ్య తొలి వన్డే | First ODI between the India and Zimbabwe womens teams starts today | Sakshi
Sakshi News home page

నేడు భారత్, జింబాబ్వే మహిళల జట్ల మధ్య తొలి వన్డే

Oct 23 2026 4:31 AM | Updated on Oct 23 2026 4:31 AM

First ODI between the India and Zimbabwe womens teams starts today

మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

వడోదర: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి టి20 సిరీస్‌ను ‘క్లీన్‌ స్వీప్‌’ చేసిన భారత మహిళల క్రికెట్‌ జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, జింబాబ్వే మహిళల జట్ల మధ్య శుక్రవారం తొలి వన్డే జరగనుంది. ఈ ఫార్మాట్‌లో జింబాబ్వేతో టీమిండియాకు ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్‌ కాగా... స్మృతి మంధాన సారథ్యంలోని భారత జట్టు ఇందులోనూ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చాలని భావిస్తోంది.

గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ నెగ్గిన తర్వాత మూడు వన్డేలు మాత్రమే ఆడిన టీమిండియా మూడింట్లోనూ పరాజయం పాలైంది. కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత జింబాబ్వేతో చివరి టి20లో ఆకాశమే హద్దుగా చెలరేగిన హర్మన్‌ప్రీత్‌ నుంచి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అలాంటి ప్రదర్శనే కోరుకుంటోంది. మరోవైపు ఈ పర్యటనలో ఒక్క విజయం సాధించనప్పటికీ జింబాబ్వే బాగానే పోరాడింది. ఆ జట్టు ఫీల్డింగ్‌లో మనకంటే ఎంతో ముందుంది. మరి వన్డే సిరీస్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement