భువనేశ్వర్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ అథ్లెట్ దొండపాటి మృత్యం జయరామ్ (21) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బుధవారం అర్ధరాత్రి దాటాక కటక్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో జయరామ్‌తో పాటు మరో యువ అథ్లెట్ మలయ్ బారిక్ (20) కూడా మరణించాడు.
కాకినాడకు చెందిన జయరామ్ కొన్నేళ్లుగా భువనేశ్వర్‌లోని రిలయెన్స్ ఫౌండేషన్ అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. జాతీయ పోటీల్లో ఒడిశాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం జైపూర్‌లో జరిగిన ఇండియన్ ఓపెన్ అండర్–23 అథ్లెటిక్స్ పోటీల్లో జయరామ్ 100 మీటర్లలో కాంస్యం, 200 మీటర్లలో రజతం గెలిచాడు. గత ఏడాది వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో జయరామ్ భారత్‌కు 4్ఠ100 రిలే రేసులో.. 2024లో ఆసియా అండర్–20 చాంపియన్‌షిప్ 4్ఠ100 రిలే రేసులో కాంస్య పతకాలు సాధించాడు.


