సిరీస్‌ క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన ఇంగ్లండ్‌.. అండర్సన్‌ దూరం  | England Announce Playing XI For 3rd Test James Anderson Rested | Sakshi
Sakshi News home page

ENG vs NZ: సిరీస్‌ క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన ఇంగ్లండ్‌.. అండర్సన్‌ దూరం 

Jun 23 2022 6:53 AM | Updated on Jun 23 2022 6:55 AM

England Announce Playing XI For 3rd Test James Anderson Rested - Sakshi

లీడ్స్‌: సొంతగడ్డపై జోరుమీదున్న ఇంగ్లండ్‌ జట్టు ఇప్పుడు టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలనే లక్ష్యంతో ఉంది. న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో కొత్త కోచ్‌ మెకల్లమ్, కొత్త కెప్టెన్‌ స్టోక్స్‌లతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 2–0తో ఇప్పటికే సిరీస్‌ గెలిచింది. గురువారం నుంచి జరిగే చివరి టెస్టులోనూ గెలిచి వైట్‌వాష్‌ చేయాలని స్టోక్స్‌ సేన పట్టుదలతో ఉంది. చీలమండ గాయంతో ఇంగ్లండ్‌ సీనియర్‌ పేస్‌ బౌలర్‌ అండర్సన్‌ ఈ టెస్టులో ఆడటంలేదు. అతని స్థానంలో కొత్త పేసర్‌ జేమీ ఓవర్టన్‌కు తుది జట్టులో అవకాశమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement