ENG VS IND 5th Test: టీమిండియాకు భారీ షాక్‌లు | ENG VS IND 5th Test Day 1: India Lost Both The Openers For 38 Runs, Read Full Story For More Updates | Sakshi
Sakshi News home page

ENG VS IND 5th Test: టీమిండియాకు భారీ షాక్‌లు

Jul 31 2025 5:11 PM | Updated on Jul 31 2025 5:35 PM

ENG VS IND 5th Test Day 1: India Lost Both The Openers For 38 Runs

భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య లండన్‌లోని కెన్నింగ్టన్‌ ఓవల్‌ వేదికగా ఇవాళ (జులై 31) ఐదో టెస్ట్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. 

ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (2), కేఎల్‌ రాహుల్‌ (14) జట్టు స్కోర్‌ కనీసం 50 పరుగులు కూడా దాటించకుండానే పెవిలియన్‌కు చేరారు. జట్టు స్కోర్‌ 10 పరుగుల వద్ద జైస్వాల్‌ను అట్కిన్సన్‌, 38 పరుగుల స్కోర్‌ వద్ద రాహుల్‌ను క్రిస్‌ వోక్స్‌ బోల్తా కొట్టించారు.

20 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోర్‌ 56/2గా ఉంది. సాయి సుదర్శన్‌ (18), శుభ్‌మన్‌ గిల్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు.

కాగా, ఈ మ్యాచ్‌ కోసం భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు చెరో నాలుగు మార్పులు చేశాయి. భారత్‌ తరఫున రిషబ్‌ పంత్‌, శార్దూల్‌ ఠాకూర్‌, బుమ్రా, అన్షుల్‌ కంబోజ్‌ స్థానాల్లో ధ్రువ్‌ జురెల్‌, కరుణ్‌ నాయర్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, ఆకాశ్‌దీప్‌ తుది జట్టులోకి రాగా.. ఇంగ్లండ్‌ తరఫున బెన్‌ స్టోక్స్, ‌జోఫ్రా ఆర్చర్‌, బ్రైడన్‌ కార్స్‌, లియామ్‌ డాసన్‌ స్థానాల్లో జేకబ్‌ బేతెల్‌, గస్‌ అట్కిన్సన్‌, జోష్‌ టంగ్‌, జేమీ ఓవర్టన్‌ ప్లేయింగ్‌ ఎలెవెన్‌లోకి వచ్చారు.

ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 1-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్‌ సిరీస్‌ను సమం చేసుకోగలుగుతుంది. ఓడినా, డ్రా అయినా ఇంగ్లండే సిరీస్‌ ఎగరేసుకుపోతుంది.  

తుది జట్లు..
భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్‌), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్‌), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్‌), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్‌కీపర్‌), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement