చరిత్ర సృష్టించిన శుభ్‌మన్‌ గిల్‌ | ENG VS IND 4TH TEST DAY 5: SHUBMAN GILL BECOMES THE FIRST ASIAN BATTER TO COMPLETE 700 RUNS IN A SERIES IN ENGLAND | Sakshi
Sakshi News home page

ENG VS IND 4th Test Day 5: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్‌ గిల్‌

Jul 27 2025 4:32 PM | Updated on Jul 27 2025 4:43 PM

ENG VS IND 4TH TEST DAY 5: SHUBMAN GILL BECOMES THE FIRST ASIAN BATTER TO COMPLETE 700 RUNS IN A SERIES IN ENGLAND

టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌ గడ్డపై ఓ టెస్ట్‌ సిరీస్‌లో 700 పరుగుల మార్కును తాకిన తొలి ఆసియా ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. 

ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో గిల్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 85 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద గిల్‌ ఈ సిరీస్‌లో 700 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

గతంలో ఇంగ్లండ్‌ గడ్డపై ఓ టెస్ట్‌ సిరీస్‌లో 700 పరుగుల మైలురాయిని ఏ ఆసియా బ్యాటర్‌  తాకలేదు. గిల్‌కు ముందు పాకిస్తాన్‌ బ్యాటర్‌ మొహమ్మద్‌ యూసఫ్‌ అత్యధికంగా 631 పరుగులు (2006 పర్యటనలో) సాధించాడు.

ఇంగ్లండ్‌ గడ్డపై ఓ టెస్ట్‌ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా బ్యాటర్లు
🏏శుభ్‌మన్‌ గిల్‌ (ఇండియా)- 700*- 2025లో- అత్యుత్తమ స్కోరు 269
🏏మొహమ్మద్‌ యూసఫ్‌ (పాకిస్తాన్‌)- 631- 2006లో- అత్యుత్తమ స్కోరు 202
🏏రాహుల్‌ ద్రవిడ్‌ (ఇండియా)- 602- 2002లో- అత్యుత్తమ స్కోరు 217
🏏విరాట్‌ కోహ్లి (ఇండియా)- 593- 2018లో- అత్యుత్తమ స్కోరు 149
🏏సునిల్‌ గావస్కర్‌ (ఇండియా)- 542- 1979లో- అత్యుత్తమ స్కోరు 221.

ఓవరాల్‌గా ఇంగ్లండ్‌ గడ్డపై ఓ టెస్ట్‌ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఆసీస్‌ దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌ పేరిట ఉంది. బ్రాడ్‌మన్‌ 1930 ఇంగ్లండ్‌ పర్యటనలో 5 మ్యాచ్‌ల్లో ఏకంగా 974 పరుగులు చేశాడు. బ్రాడ్‌మన్‌ తర్వాత ఇంగ్లండ​ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన రికార్డు (విదేశీ ఆటగాళ్లు) మార్క్‌ టేలర్‌ (839), వివ్‌ రిచర్డ్స్‌ (829), స్టీవ్‌ స్మిత్‌ (774), బ్రియాన్‌ లారా (765) పేరిట ఉంది.

నాలుగో బ్యాటర్‌
ప్రస్తుత ఇంగ్లండ్‌ పర్యటనలో 700 పరుగుల మార్కును తాకిన గిల్‌ భారత్‌ తరఫున ఓ టెస్ట్‌ సిరీస్‌లో ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

భారత్‌ తరఫున ఓ టెస్ట్ సిరీస్‌లో 700 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్లు
774 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్‌, 1971 (బయట)
732 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్‌, 1978/79 (హోం)
712 - యశస్వి జైస్వాల్ vs ఇంగ్లండ్, 2024 (హోం)
701* - శుభ్‌మన్ గిల్ vs ఇంగ్లండ్, 2025 (బయట)

మ్యాచ్‌ విషయానికొస్తే.. 311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా పోరాడుతోంది. తొలి ఓవర్లో ఖాతా తెరవ‌కుండానే రెండు వికెట్లు కోల్పోయి భార‌త్‌ను శుభ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌ ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 188 పరుగులు జోడించారు.

ఆదిలోనే షాక్‌ 
అయితే చివరి రోజు భారత్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. 90 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద కేఎల్‌ రాహుల్‌ బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ప్రస్తుతం శుభ్‌మన్‌ గిల్‌ 90, వాషింగ్టన్‌ సుందర్‌ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత్‌ స్కోర్‌ 193/3గా ఉంది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు భారత్‌ ఇంకా 118 పరుగులు వెనుక​పడి ఉంది.

స్కోర్‌ వివరాలు..
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌- 358 ఆలౌట్‌ (సాయి సుదర్శన్‌ 61, జైస్వాల్‌ 58, పంత్‌ 54, స్టోక్స్‌ 5/72)

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌- 669 ఆలౌట్‌ (రూట్‌ 150, స్టోక్స్‌ 141, రవీంద్ర జడేజా 4/143)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement