అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ | du Preez announces retirement from all forms of international cricket | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌

Dec 9 2022 7:37 PM | Updated on Dec 9 2022 7:43 PM

du Preez announces retirement from all forms of international cricket - Sakshi

దక్షిణాఫ్రికా మహిళల జట్టు మాజీ కెప్టెన్‌ మిగ్నాన్ డు ప్రీజ్ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు విడ్కోలు పలికింది. ఇప్పటికే వన్డేలు, టెస్టులకు గుడ్‌ బై చెప్పిన మిగ్నాన్.. తాజగా టీ20ల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన డు ప్రీజ్.. ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ లీగ్‌లలో మాత్రం ఆడనుంది.

ఈ ఏడాది బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో డు ప్రీజ్ చివరిసారిగా టీ20 మ్యాచ్‌ ఆడింది. తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో 114 టీ20లు ఆడిన డు ప్రీజ్ 1805 పరుగులు సాధించింది. ఆమె ఇన్నింగ్స్‌లలో 7 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఆమె వన్డే, టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించింది. 

కాగా 2007 లో అంతర్జాతీయ క్రికెట్‌లో మిగ్నాన్ డు ప్రీజ్  అరంగేట్రం చేసింది.  2011 నుంచి 2016 వరకు దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా కూడా డు ప్రీజ్ బాధ్యతలు నిర్వహించింది. దక్షిణాఫ్రికా తరపున  అత్యధిక వన్డేలు ఆడిన  మహిళా క్రికెటర్‌ కూడా డు ప్రీజ్ కావడం విశేషం. ఆమె తన వన్డే కెరీర్‌లో 154 మ్యాచ్‌లు ఆడిన డు ప్రీజ్.. 3760 పరుగులు సాధించింది. తన కెరీర్‌లో 18 అర్ధ సెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి.
చదవండిWTC 2021-23: విండీస్‌తో మ్యాచ్‌.. ఆస్ట్రేలియా భారీ స్కోరు! ఫైనల్‌ చేరే క్రమంలో..

Advertisement
 
Advertisement
Advertisement