MS Dhoni- Rohit: ఆరోజు రోహిత్‌ వద్దంటూ.. ధోని అతడి కోసం పట్టుబట్టాడు.. వెంటనే కోచ్‌ కూడా! మేమేం చేయలేకపోయాం..

Dhoni Wanted Piyush Over Rohit Sharma For 2011 WC: Former Selector - Sakshi

MS Dhoni- 2011 ODI World Cup- Rohit Sharma: ‘‘ఆరోజు వరల్డ్‌కప్‌ జట్టును ఎంపిక చేసేందుకు మేమంతా కూర్చుని చర్చలు సాగిస్తున్నాం. మొత్తం 15 మందికి చోటివ్వాలి. 1-14 వరకు అంతా సజావుగా సాగిపోయింది. పదిహేనో ఆటగాడిగా మేము రోహిత్‌ శర్మ పేరు సూచించాం.

గ్యారీ కిర్‌స్టన్‌ కూడా ఇది సరైన ఎంపిక అని మాకు మద్దతుగా నిలిచారు. కానీ కెప్టెన్‌ మాత్రం మాతో అంగీకరించలేదు. రోహిత్‌ శర్మకు బదులు పీయూశ్‌ చావ్లా కావాలని పట్టుబట్టాడు. అంతే.. గ్యారీ కిర్‌స్టన్‌ కూడా వెంటనే మాట మార్చేశాడు.

వెంటనే మాట మార్చాడు
‘‘అవును అదే బెటర్‌ చాయిస్‌’’ అన్నాడు. అలా రోహిత్‌ శర్మ వరల్డ్‌కప్‌ జట్టు నుంచి అవుట్‌ అయ్యాడు’’ అని బీసీసీఐ మాజీ సెలక్టర్‌ రాజా వెంకట్‌ అన్నాడు. మహేంద్ర సింగ్‌ ధోని ఆలోచనలకు అనుగుణంగానే 2011 వరల్డ్‌కప్‌ నాటి జట్టు ఎంపికలో స్వల్ప మార్పులు జరిగాయని గుర్తు చేసుకున్నాడు.

రోహిత్‌ శర్మ సేనపై భారీ అంచనాలు
పుష్కరకాలం తర్వాత భారత్‌ మరోసారి వన్డే ప్రపంచకప్‌-2023 టోర్నీకి ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. 2011లో ధోని సేన ట్రోఫీని గెలిచిన నేపథ్యంలో.. ఈసారి రోహిత్‌ శర్మ బృందంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సొంతగడ్డపై టీమిండియా తప్పక టైటిల్‌ గెలుస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు.

ఈ క్రమంలో ఆసియా కప్‌-2023కి సోమవారం ప్రకటించిన జట్టు నుంచే ప్రపంచకప్‌ టీమ్‌ను ఎంపిక చేస్తామని చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా సారథిగా జట్టును ముందుకు నడిపిస్తున్న రోహిత్‌ శర్మకు 2011 నాటి జట్టులో చోటే దక్కలేదు.

వరల్డ్‌కప్‌ జట్టులో రోహిత్‌ వద్దన్నాడు.. అతడి కోసం
ఈ విషయం గురించి రాజా వెంకట్‌ రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ధోని నిర్ణయం వల్లే నాడు రోహిత్‌ మెగా ఈవెంట్‌కు సెలక్ట్‌ కాలేదని చెప్పుకొచ్చాడు. నాడు రోహిత్‌ కంటే.. లెగ్‌ స్పిన్నర్‌ పీయూశ్‌ చావ్లావైపే మిస్టర్‌ కూల్‌ మొగ్గు చూపాడని చెప్పుకొచ్చాడు.

ఈ విషయంలో రోహిత్‌ తీవ్ర నిరాశకు గురైన మాట వాస్తవమేనని.. అతడి సెలక్ట్‌ చేయనందుకు తాము కూడా బాధ పడ్డట్లు తెలిపాడు. కెప్టెన్‌, కోచ్‌ ఒక మాట మీద ఉన్న తర్వాత.. 14 మందిని ఎంపిక చేసిన తాము నో అని చెప్పలేకపోయామని వాపోయాడు.

రోహిత్‌ బాధ పడ్డాడు.. మేమేం చేయలేకపోయాం
కాగా ఆరోజు జట్టులో స్థానం దక్కని కారణంగా తను ఎంతో వేదనకు గురయ్యానని రోహిత్‌ శర్మ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. నాడు వరల్డ్‌కప్‌లో పీయూశ్‌ ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక ఆరంభంలో లోయర్‌ ఆర్డర్‌లో ఆడిన రోహిత్‌ను ఓపెనర్‌గా ప్రమోట్‌ చేసిన ఘనత మాత్రం ధోనిదేనని ప్రత్యేకంగా చెపాల్సిన పనిలేదు.

ఇదిలా ఉంటే.. అక్టోబరు 5 న భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీ ఆరంభం కానుంది. ఈ క్రమంలో అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో పోరుతో టీమిండియా తమ ప్రయాణం మొదలుపెట్టనుంది.
చదవండి: అయ్యో రింకూ.. ఇంగ్లీష్‌ రాక ఇబ్బంది పడిన సిక్సర్ల కింగ్‌! బుమ్రా మంచి మనసు
అందుకే తిలక్‌ను సెలక్ట్‌ చేశాం.. వరల్డ్‌ కప్‌ టీమ్‌లో: బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

13-11-2023
Nov 13, 2023, 09:28 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్లు కేఎల్‌ రాహుల్‌ (63 బంతుల్లో 102; 11...
13-11-2023
Nov 13, 2023, 08:48 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అదిరిపోయే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత...
13-11-2023
Nov 13, 2023, 08:18 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత్‌...
13-11-2023
Nov 13, 2023, 07:38 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్‌...
12-11-2023
Nov 12, 2023, 22:00 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ సుడిగాలి శతకం సాధించాడు. ఈ...
12-11-2023
Nov 12, 2023, 21:44 IST
నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన భారత్‌.. వరుసగా తొమ్మిదో విజయం  వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భారత జైత్రయాత్ర కొనసాగుతుంది. ఈ ఎడిషన్‌లో రోహిత్‌...
12-11-2023
Nov 12, 2023, 21:09 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌  చేసిన టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. కేఎల్‌...
12-11-2023
Nov 12, 2023, 20:32 IST
వన్డేల్లో విరాట్‌ కోహ్లి తొమ్మిదేళ్ల తర్వాత వికెట్‌ తీశాడు. వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌...
12-11-2023
Nov 12, 2023, 20:03 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్ జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు మహోగ్రరూపం దాల్చారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు...
12-11-2023
Nov 12, 2023, 19:44 IST
దీపావళి పర్వదినాన నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు టాపాసుల్లా పేలారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు మెరుపు...
12-11-2023
Nov 12, 2023, 19:07 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. 48 ఏళ్ల వరల్డ్‌కప్‌ చరిత్రలో...
12-11-2023
Nov 12, 2023, 18:26 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో వరుస విజయాలతో (8) దూసుకుపోతున్న టీమిండియా.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు దీపావళి సంబురాల్లో పాల్గొంది. బెంగళూరులోని విలాసవంతమైన...
12-11-2023
Nov 12, 2023, 16:45 IST
టీమిండియా యంగ్‌ గన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఈ ఏడాది ఫార్మాట్లకతీతంగా అరాచకమైన ఫామ్‌లో ఉన్నాడు. వన్డేల్లో అయితే అతను ఆకాశమే...
12-11-2023
Nov 12, 2023, 15:57 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో ఇవాళ (నవంబర్‌ 12) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ...
12-11-2023
Nov 12, 2023, 13:36 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో చివరి లీగ్‌ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బెంగళూరు వేదికగా భారత్‌-నెదర్లాండ్స్‌ జట్లు...
12-11-2023
Nov 12, 2023, 13:25 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీఫైనల్‌కు ముందు దక్షిణాఫ్రికా బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ టెంబా బావుమా గాయం కారణంగా...
12-11-2023
Nov 12, 2023, 12:32 IST
అఫ్గానిస్తాన్‌ స్టార్‌ ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్ తన మంచి మనసును చాటుకున్నాడు. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించే గుర్భాజ్‌.. ఆఫ్‌ది...
12-11-2023
Nov 12, 2023, 12:05 IST
పాకిస్తాన్‌ క్రికెట్ టీమ్‌.. వన్డే ప్రపంచకప్‌-2023 టైటిల్‌ ఫేవరేట్‌గా భారత గడ్డపై అడుగుపెట్టిన జట్లలో ఒకటి. కానీ అందరి అంచనాలను...
12-11-2023
Nov 12, 2023, 09:18 IST
వన్డే ప్రపంచకప్‌-2023 చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న భారత్‌-నెదర్లాండ్‌ మ్యాచ్‌తో ఈ ​మెగా టోర్నీ లీగ్‌ స్టేజి ముగియనుంది....
12-11-2023
Nov 12, 2023, 08:53 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023ను పాకిస్తాన్‌ ఓటమితో ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా కోల్‌కతా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 93...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top