దీపక్‌ హుడా సరికొత్త చరిత్ర.. తొలి భారత ఆటగాడిగా! | Sakshi
Sakshi News home page

IND vs NZ: దీపక్‌ హుడా సరికొత్త చరిత్ర.. తొలి భారత ఆటగాడిగా!

Published Sun, Nov 20 2022 4:28 PM

Deepak Hooda picks up four wickets, Best figures for India vs NZ in T20Is - Sakshi

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 65 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 126 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీపక్‌ హుడా నాలుగు వికెట్లతో చెలరేగగా.. చాహల్‌, సిరాజ్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

న్యూజిలాండ్‌ బ్యాటర్లలో విలియమ్సన్‌ఒక్కడే 61 పరుగులతో రాణించాడు. ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదర్కొన్న సూర్యకుమార్‌ 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 111 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అదే విధంగా న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ హ్యాట్రిక్‌ వికెట్లు సాధించాడు.

దీపక్‌ హుడా అరుదైన రికార్డు
ఇక నాలుగు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన దీపక్‌ హుడా అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 2.5 ఓవర్లు బౌలింగ్‌ చేసిన హుడా 4వికెట్లు పడగొట్టి కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తద్వారా న్యూజిలాండ్‌పై టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
చదవండి: IND vs NZ: పాపం శ్రేయస్‌ అయ్యర్‌.. అసలు ఊహించి ఉండడు! వీడియో వైరల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement