David Warner: పాకిస్తాన్‌కు వెళ్తున్నా.. ఫ్యామిలీకి వార్నర్‌ ఎమోషనల్‌ నోట్‌

David Warner Emotional Note Before Leaving Pakistan Tour Missing Family - Sakshi

దాదాపు 24 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్‌లో పర్యటించనుంది. పాక్‌ గడ్డపై ఆసీస్‌ మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టి20 మ్యాచ్‌ ఆడనుంది.  మార్చి 8 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌ ఏప్రిల్‌ 5 వరకు కొనసాగనుంది. కాగా ఐపీఎల్‌ ప్రారంభ దశ పోటీలకు ఆస్ట్రేలియా క్రీడాకారులు దూరం కానున్నారు. ఈ విషయం పక్కనబెడితే ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ పాక్‌ పర్యటన సందర్భంగా తన ఫ్యామిలీకి గుడ్‌బై చెబుతూ ఎమోషనల్‌ నోట్‌ రాసుకొచ్చాడు. తన భార్య కాండీస్‌, పిల్లలు ఇవి, ఇండీ, ఇస్లాలతో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

''నా పిల్లలకు గుడ్‌బై చెప్పడం ఎప్పుడు బాధగానే అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో నా భార్య, పిల్లలతో కలిసి సంతోషకరమైన క్షణాలు ఎన్నో గడిపాను. ఇన్ని రోజుల గ్యాప్‌ తర్వాత పాక్‌ పర్యటనకు వెళ్లనుండడంతో మీకు దూరం కావాల్సి వస్తోంది. త్వరలోనే మిమ్నల్ని కలుస్తాను. ఐ మిస్‌ సో మచ్‌'' అంటూ ఉద్వేగంగా పేర్కొన్నాడు. 

ఇక పాక్‌ పర్యటన నేపథ్యంలో వార్నర్‌ ఆ టోర్నీ ముగిసిన తర్వాత నేరుగా ఐపీఎల్‌లో అడుగుపెట్టనున్నాడు. వన్డే సిరీస్‌, టి20 మ్యాచ్‌కు వార్నర్‌ ఎంపిక కానప్పటికి క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎన్‌వోసీ ఇచ్చేవరకు వార్నర్‌ ఐపీఎల్‌ ఆడే వీలు లేదు. ఏప్రిల్‌ 5న పాక్‌ పర్యటన ముగియనున్న నేపథ్యంలో.. తర్వాతి రోజు ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు ఆటగాళ్లకు ఎన్‌వోసీ ఇచ్చే అవకాశముంది. ఇక వార్నర్‌ను మెగావేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ.6.25 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

చదవండి: 'యుద్ధం ఆపేయండి'.. సొంత దేశాన్ని ఏకిపారేసిన టెన్నిస్‌ స్టార్‌

'ఇప్పుడు నా టార్గెట్ అదే.. ఆ జట్టు‍కు హెడ్‌ కోచ్‌గా'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top