CWC 2023: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌.. రెండు మార్పులు | CWC 2023 ENG VS NED: England Won The Toss And Elected To Bat | Sakshi
Sakshi News home page

CWC 2023: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌.. రెండు మార్పులు

Nov 8 2023 1:41 PM | Updated on Nov 8 2023 1:46 PM

CWC 2023 ENG VS NED: England Won The Toss And Elected To Bat - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా పూణే వేదికగా ఇవాళ (నవంబర్‌ 8) నామమాత్రపు మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ప్రస్తుత ఎడిషన్‌ నుంచి ఇదివరకే ఎలిమినేట్‌ అయిన ఇంగ్లండ్‌.. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉండి కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్న నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. గత మ్యాచ్‌లో ఆడిన మార్క్‌ వుడ్‌, లివింగ్‌స్టోన్‌ స్థానాల్లో హ్యారీ బ్రూక్‌, అట్కిన్సన్‌ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు నెదర్లాండ్స్‌ ఒకే మార్పుతో బరిలోకి దిగుతుంది. జుల్ఫికర్‌ స్థానంలో తెలుగు ఆటగాడు తేజ నిడమనూరు బరిలోకి దిగుతున్నాడు.

తుది జట్లు..
ఇంగ్లండ్‌: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్‌, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), మొయిన్ అలీ, అట్కిన్సన్‌, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్

నెదర్లాండ్స్‌: వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), బాస్ డి లీడ్‌, తేజ నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్

Advertisement
 
Advertisement
Advertisement