పుజారాకు గాయం.. రెండో ఇన్నింగ్స్‌కు డౌటే! | Cheteshwar Pujara Injured Absent To Field On 2nd Day Against England | Sakshi
Sakshi News home page

పుజారాకు గాయం.. రెండో ఇన్నింగ్స్‌కు డౌటే!

Feb 14 2021 12:23 PM | Updated on Feb 14 2021 2:29 PM

Cheteshwar Pujara Injured Absent To Field On 2nd Day Against England - Sakshi

చెన్నై: టీమిండియా టెస్ట్‌ స్పెషలిస్ట చతేశ్వర్‌ పుజారా గాయపడినట్లు తెలుస్తుంది. రెండో టె​స్టు తొలిరోజు టీమిండియా బ్యాటింగ్‌ సమయంలో పుజారా చేతికి బంతి తగిలి గాయమైంది. దీనిలో భాగంగానే రెండో రోజు ఆటలో ఇంగ్లండ్‌ ఇన్సింగ్స్‌ సమయంలో పుజారా ఆన్‌ఫీల్డ్‌లో కనిపించలేదు. అతని స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌గా వ్యవహరించాడు. గాయం తీవ్రత గురించి తెలియదు కానీ..  గాయం పెద్దదైతే మాత్రం పుజారా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాగా పుజారా తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పటికైతే ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ వరకు పుజారా ఫీల్డింగ్‌కు వచ్చే అవకాశం లేదని జట్టు మేనుజ్‌మెంట్‌ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా రోహిత్‌ సెంచరీతో మెరవడంతో టీమిండియా తొలిరోజు 300 పరుగులు ప్కోరును దాటింది. రెండో రోజు మాత్రం క్రితం రోజు స్కోరుకు కేవలం 29 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్‌ కాగా.. రిషబ్‌ పంత్‌ 58 నాటౌట్‌ మెరిశాడు. కాగా ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో తడబడుతుంది. లంచ్‌ విరామం సమయానికి 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement