సెంచరీతో చెలరేగిన పుజారా.. భారత సెలక్టర్లకు వార్నింగ్‌! వీడియో వైరల్‌

Cheteshwar Pujara eyeing Team India recall after scoring another century  - Sakshi

టీమిండియా వెటరన్‌ ఆటగాడు ఛతేశ్వర్‌ పుజారా ఇంగ్లండ్‌ కౌంటీల్లో తన అద్భుత ఫామ్‌ను​ కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రాయల్‌ లండన్‌ వన్డే కప్‌లో ససెక్స్‌ క్రికెట్‌ క్లబ్‌కు పుజారా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో పుజారా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.  ఈ మ్యాచ్‌లో 113 బంతులు ఎదుర్కొన్న పుజారా.. 11 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

ఈ టోర్నీలో పుజారాకు ఇది రెండో సెంచరీ కావడం గమనార్హం. పుజారా అద్భుత సెంచరీ ఫలితంగా.. ఈ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ససెక్స్‌ విజయం సాధించింది. 319 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ససెక్స్‌ 48.1 ఓవర్లలోనే ఛేదించింది. పుజారాతో పాటు టామ్ ఆల్సోప్(60) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన సోమర్‌సెట్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. సోమర్‌సెట్‌ బ్యాటర్లలో ఉమీద్‌, కర్టిస్ కాంఫర్ సెంచరీలతో మెరిశారు.

సెలక్టర్లకు వార్నింగ్‌..
ఇక​ ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్లో విఫలమకావడంతో పుజారాపై భారత సెలక్టర్లు వేటు వేశారు. దీంతో వెస్టిండీస్‌తో టెస్టులకు అతడిని ఎంపికచేయలేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ కౌంటీల్లో రాణించి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని పుజారా లక్ష్యంగా పెట్టుకున్నాడు. గతంలో కూడా పుజారాను జట్టు నుంచి సెలక్టర్లు ఊద్వసన పలికారు. దీతో ఈ కౌంటీల్లోనే అదరగొట్టి.. మళ్లీ భారత జట్టులోకి అతడు పునరాగమనం చేశాడు.

ఇక ఈ మ్యాచ్‌ అనంతరం పుజారా మాట్లాడుతూ.. "నేను ఎక్కడ ఆడినా నా వంతు 100 శాతం ఎఫక్ట్‌ పెడతాను. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నిస్తాను. భారత్‌కు మరో మూడు నెలల పాటు ఎటువంటి టెస్టు మ్యాచ్‌లు లేవు. డిసెంబర్‌లో మళ్లీ దక్షిణాఫ్రికాతో ఆడనున్నాం​. అంతకంటే ముందు నేను ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌పై దృష్టిపెడతాను. అక్కడ రాణించి మళ్లీ జట్టులోకి రావడమే నా లక్ష్యమని" పుజారా పేర్కొన్నాడు. రాయల్‌ లండన్‌ వన్డే కప్‌-2023లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన పుజారా 302 పరుగులు చేశాడు.
చదవండిIND vs WI: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. హెడ్‌కోచ్‌ లేకుండానే! టీమిండియా ఎలా మరి?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top