చాంపియన్స్‌ రితిన్‌ ప్రణవ్, వైదేహి | Champions Rithin Pranav and Vaidehi | Sakshi
Sakshi News home page

చాంపియన్స్‌ రితిన్‌ ప్రణవ్, వైదేహి

Oct 6 2024 4:07 AM | Updated on Oct 6 2024 4:07 AM

Champions Rithin Pranav and Vaidehi

ఫెనెస్టా ఓపెన్‌ జాతీయ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌  

న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్‌ జాతీయ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో టాప్‌ సీడ్, గుజరాత్‌ క్రీడాకారిణి వైదేహి చౌదరి విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగిన వైదేహి 6–3, 6–3తో మాయా రేవతి (తమిళనాడు)పై విజయం సాధించింది. 

గంటన్నర పాటు సాగిన తుది పోరులో తొలి గేమ్‌ కోల్పోయిన వైదేహి ఆ తర్వాత వరుసగా మూడు గేమ్‌లు నెగ్గి ముందంజ వేసింది. అదే జోరులో తొలి సెట్‌ కైవసం చేసుకున్న వైదేహి.. రెండో సెట్‌ కూడా నెగ్గి రెండోసారి జాతీయ చాంపియన్‌గా నిలిచింది. 

పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో అన్‌సీడ్‌ ప్లేయర్‌ రెథిన్‌ ప్రణవ్‌ (తమిళనాడు) 6–4, 2–6, 6–2తో నితిన్‌ కుమార్‌ సిన్హా (రైల్వేస్‌)పై గెలిచి చాంపియన్‌గా అవతరించాడు. క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన 17 ఏళ్ల రెథిన్‌ ప్రణవ్‌ వరుస విజయాలతో సత్తా చాటి విజేతగా నిలిచాడు.  

Advertisement
 
Advertisement
Advertisement