సినెర్‌ అవుట్‌ | Sinner shocked by Juan Manuel Cerundolo | Sakshi
Sakshi News home page

సినెర్‌ అవుట్‌

May 29 2026 4:55 AM | Updated on May 29 2026 4:55 AM

Sinner shocked by Juan Manuel Cerundolo

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నిలో గురువారం పెను సంచలనం చోటు చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో టైటిల్‌ ఫేవరెట్, ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ) రెండోరౌండ్‌లోనే ని్రష్కమించాడు. ప్రపంచ 56వ ర్యాంకర్‌ సెరున్‌డోలో (అర్జెంటీనా) 3–6, 2–6, 7–5, 6–1, 6–1తో సినెర్‌ను బోల్తా కొట్టించి మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. 

తొలి రెండు సెట్‌లు గెలిచి సినెర్‌ మూడో సెట్‌లో 5–1తో ఆధిక్యంలో నిలిచి విజయం అంచుల్లో నిలిచాడు. ఆ తర్వాత సినెర్‌ ఒక్కసారిగా గాడితప్పాడు. వరుసగా ఆరు గేమ్‌లు కోల్పోయి సెట్‌ను చేజార్చుకున్నాడు. తీవ్రమైన ఎండ కారణంగా పూర్తిగా అలసిపోయిన సినెర్‌ చివరి రెండు సెట్‌లలో పూర్తిగా చేతులెత్తేశాడు. 

3 గంటల 36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సినెర్‌ ఐదు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. తన సరీ్వస్‌ను ఎనిమిదిసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేశాడు. 51 విన్నర్స్‌ కొట్టిన సినెర్‌ 64 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు సెరున్‌డోలో 14 ఏస్‌లుసంధించడంతోపాటు 52 విన్నర్స్‌ కొట్టాడు.  

జొకోవిచ్‌కు సువర్ణావకాశం 
డిఫెండింగ్‌ చాంపియన్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) గైర్హాజరీ... ఈ సీజన్‌లో సినెర్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో... అతనికి తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ ఖాయమని
పించింది. ఇప్పటికే ఆ్రస్టేలియన్‌ ఓపెన్, వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌ టైటిల్స్‌ నెగ్గిన సినెర్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ కూడా గెలిచిఉంటే ‘కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌’ ఘనతను పూర్తి చేసేవాడు. సినెర్‌ నిష్క్రమణ నేపథ్యంలో సెర్బియా దిగ్గజం జొకోవిచ్‌కు 25వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించి రికార్డు సృష్టించే సువర్ణావకాశం లభించింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement