IPL RCB Vs MI: బుమ్రా కళ్లు చెదిరే యార్కర్‌.. బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో వైరల్‌ | IPL 2024 RCB Vs MI: Bumrahs Killer Yorker Puts Lomror In Pain As He Departs For A Golden Duck, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2024 RCB VS MI: బుమ్రా కళ్లు చెదిరే యార్కర్‌.. బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో వైరల్‌

Apr 12 2024 6:50 AM | Updated on Apr 12 2024 9:58 AM

Bumrahs Killer Yorker Puts Lomror In Pain IN Ipl 2024 - Sakshi

ఐపీఎల్‌-2024లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా 5 వికెట్లతో చెలరేగాడు. తన సహాచర బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికి బుమ్రా మాత్రం తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తన నాలుగు ఓవర్లలో కోటాలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు సాధించాడు.

అయితే ఈ మ్యాచ్‌లో బుమ్రా అద్బుతమైన యార్కర్‌తో మెరిశాడు. సంచలన బంతితో బెంగళూరు బ్యాటర్‌ మహిపాల్‌ లోమ్రోర్‌ను బుమ్రా బోల్తా కొట్టించాడు. బుమ్రా వేసిన బంతికే లామ్రోర్‌ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ 17 ఓవర్‌ వేసిన బుమ్రా.. నాలుగో బంతిని లెగ్ స్టంప్ టార్గెట్ చేస్తూ యార్కర్‌ సంధించాడు.

ఈ క్రమంలో లోమ్రోర్ తన బ్యాట్‌తో బంతిని ఆపేలోపే నేరుగా వెళ్లి ప్యాడ్‌కు తాకింది. బుమ్రా ఎల్బీకి అప్పీలు చేయగా  అంపైర్‌ వెంటనే ఔట్ అని వేలు పైకెత్తాడు. లోమ్రోర్ రివ్యూ తీసుకున్నప్పటికి ఫలితం మాత్రం శూన్యం. రిప్లేలో బంతి క్లియర్‌గా లెగ్‌ స్టంప్‌కు తాకుతున్నట్లు తేలింది. దీంతో లోమ్రోర్ గోల్డెన్‌ డక్‌గా మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా ​మారింది. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement