IND VS AUS: బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024-25 షెడ్యూల్‌ విడుదల | Border Gavaskar Trophy 2024-25 Schedule Announced | Sakshi
Sakshi News home page

IND VS AUS: బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024-25 షెడ్యూల్‌ విడుదల

Published Tue, Mar 26 2024 2:31 PM | Last Updated on Tue, Mar 26 2024 3:02 PM

Border Gavaskar Trophy 2024 25 Schedule Announced - Sakshi

ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది చివర్లో జరుగనున్న బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024-25కు సంబంధించిన షెడ్యూల్‌ ఇవాళ (మార్చి 26) విడుదలైంది. భారత-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ హైఓల్టేజ్‌ సిరీస్‌ నవంబర్‌ 22 నుంచి ప్రారంభం కానుంది. 1991-92 సీజన్‌ తర్వాత తొలిసారి ఈ సిరీస్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌గా మారింది.

ఈ సిరీస్‌లో రెండో టెస్ట్‌ మ్యాచ్‌ డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌గా సాగనుంది. పింక్‌ బాల్‌తో ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన టికెట్లు జూన్‌ 4 నుంచి ఆన్‌లైన్‌లో లభ్యమవుతాయి. ఇటీవలికాలంలో జరిగిన నాలుగు BGT సిరీస్‌లను వరుసగా కైవసం చేసుకున్న టీమిండియా.. ఐదో సిరీస్‌పై కన్నేసింది. భారత్‌ 2017, 2019, 2021, 2023 బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలను సొంతం చేసుకుంది. 

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024-25 షెడ్యూల్‌..

  • నవంబర్‌ 22-26- పెర్త్‌
  • డిసెంబర్‌ 6-10- అడిలైడ్‌ ఓవల్‌ (డే అండ్‌ నైట్‌, పింక్‌ బాల్‌ టెస్ట్‌)
  • డిసెంబర్‌ 14-18- గబ్బా 
  • డిసెంబర్‌ 26-30- మెల్‌బోర్న్‌
  • 2025 జనవరి 3-7- సిడ్నీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement