
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ద్వారా రోహిత్ శర్మ తొలిసారి పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. మొత్తం మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్న ఈ సిరీస్‌లో రోహిత్ ముంగిట అరుదైన రికార్డులు ఎదురుచూస్తున్నాయి. ఇక ఆదివారం జరగనున్న తొలి వన్డే టీమిండియాకు 1000వ వన్డే మ్యాచ్ కావడం విశేషం. ఇక కెప్టెన్‌గానే గాక బ్యాట్స్‌మన్‌గానూ రోహిత్ సాధించనున్న రికార్డులను ఒకసారి పరిశీలిద్దాం.
►రోహిత్ శర్మ వన్డేల్లో ఇప్పటివరకు 244 సిక్సర్లు కొట్టాడు. మరో ఆరు సిక్సర్లు కొడితే వన్డే చరిత్రలో టీమిండియా తరపున 250 సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలవనున్నాడు. టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని 229 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఒక ఓవరాల్‌గా వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో రోహిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. షాహిద్ అఫ్రిది(351), క్రిస్ గేల్(331), సనత్ జయసూర్య(270) సిక్సర్లతో వరుసగా తొలి మూడుస్థానాల్లో ఉన్నారు.
►ఇక స్వదేశంలో వెస్టిండీస్‌పై రోహిత్ శర్మ వన్డేల్లో ఇప్పటివరకు 1523 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ మరో 51 పరుగులు చేస్తే బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను అధిగమించి రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఇక ఈ జాబితాలో విరాట్ కోహ్లి(38 ఇన్నింగ్స్‌లో 2235 పరుగులు) తొలిస్థానంలో ఉన్నాడు.
►రోహిత్ శర్మ 179 పరుగులు చేస్తే.. వన్డేల్లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో ఆరో స్థానానికి చేరుకోనున్నాడు. ప్రస్తుతం రోహిత్ వన్డేల్లో 9205 పరుగులతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ అజారుద్దీన్‌ను(9378) అధిగమించే అవకాశం ఉంది. ఈ జాబితాలో టీమిండియా నుంచి సచిన్ టెండూల్కర్(18426 పరుగులు), విరాట్ కోహ్లి(12285 పరుగులు), సౌరవ్ గంగూలీ(11221 పరుగులు), రాహుల్ ద్రవిడ్(10768 పరుగులు), ఎంఎస్ ధోని(10599 పరుగులు) వరుసగా తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు.