తొలి విజయం సాధించిన బెజవాడ టైగర్స్‌.. అదరగొట్టిన వారియర్స్‌ | Sakshi
Sakshi News home page

APL 2023: తొలి విజయం సాధించిన బెజవాడ టైగర్స్‌.. అదరగొట్టిన వారియర్స్‌

Published Tue, Aug 22 2023 8:19 AM

Bezawada tigers register first win andhra premier league 2023 - Sakshi

విశాఖ స్పోర్ట్స్‌: ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌లో బెజవాడ టైగర్స్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో టైగర్స్‌ 7 వికెట్లతో ఉత్తరాంధ్ర లయన్స్‌ను ఓడించింది. లయన్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మహీప్‌ కుమార్‌ (77 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), రికీ భుయ్‌ (41; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కలిసి జట్టును గెలిపించారు.

వైజాగ్‌ వారియర్స్, రాయలసీమ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ ‘టై’గా ముగిసింది. అయితే సూపర్‌ ఓవర్‌ ద్వారా వారియర్స్‌ విజేతగా నిలిచింది. వారియర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులు సాధించింది. ప్రశాంత్‌ (73; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఆ తర్వాత కింగ్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేసింది. విహారి (71; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), అభిషేక్‌ రెడ్డి  (58 రిటైర్డ్‌హర్ట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. సూపర్‌ ఓవర్‌లో కింగ్స్‌ 2 వికెట్లు కోల్పోయి ఒకే ఒక పరుగు చేయగా, వారియర్స్‌ 2 పరుగులు చేసి గెలిచింది.    

Advertisement
 
Advertisement
 
Advertisement