
చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన విచారణలో బెంగళూరు పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. సీఎం సిద్దరామయ్య ఆదేశాల మెరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ మెనెజ్‌మెంట్‌పై చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను శుక్రవారం అరెస్టు చేశారు.
ముంబైకి వెళ్తుండగా బెంగళూరు ఎయిర్‌పోర్టులో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ ఈవెంట్ నిర్వాహక సంస్థ డీఎన్ఎ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
నిఖిల్ సోసాలేను పోలీసులు ప్రస్తుతం రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అతడి అరెస్ట్‌పై ఆర్సీబీ యాజమాన్యం ఇప్పటివరకు ఇంకా స్పందించలేదు. కాగా బుధవారం (జూన్ 4) జరిగిన తొక్కిసలాటలో 11మంది మృతిచెందారు. దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు.

ఇక ఈ ఘటనపై గురువారం విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీస ఏర్పాట్లు లేకుండా ఈవెంట్ ఎలా నిర్వహిస్తారని చీఫ్ జస్టిస్‌తో కూడిన ధర్మాసనం మండిపడింది. ఈ ఘటన వెనుక కారణాలను తేల్చాలని సిద్దరామయ్య సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది.
దీంతో కర్ణాటక ప్రభుత్వం సీఐడీ పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కాగా ఇప్పటికే బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద్, డీసీపీ శేఖర్, ఇన్‌స్పెక్టర్ గిరీశ్‌లపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్‌కు కొత్త పేరు ఖరారు