ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్‌.. బంగ్లాదేశ్‌ గౌరవప్రదమైన స్కోర్‌ | Bangladesh Bowled Out For 346 In First Innings As Afghanistan Reach 98 For 2 In Abu Dhabi One Off Test, Check More Details | Sakshi
Sakshi News home page

ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్‌.. బంగ్లాదేశ్‌ గౌరవప్రదమైన స్కోర్‌

Oct 10 2026 3:26 PM | Updated on Oct 10 2026 3:34 PM

Bangladesh All out for 346 in 1st innings vs Afghanistan in one off test

source: X

అబుదాబీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసి 92.3 ఓవర్లలో 346 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు షద్మాన్‌ ఇస్లాం (67), తంజిద్‌ హసన్‌ (83)తో పాటు వికెట్‌కీపర్‌ లిట్టన్‌ దాస్‌ (53) అర్ద సెంచరీలతో రాణించారు.

మొమినుల్‌ హక్‌ (39), కెప్టెన్‌ నజ్ముల్‌ హసన్‌ షాంటో (29), మెహిది హసన్‌ మిరాజ్‌ (24), నయీమ్‌ హసన్‌ (35 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వెటరన్‌ బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీం, ఎబాదత్‌ హొసేన్‌ డకౌట్లు కాగా.. హసన్‌ మహముద్‌ 2, తైజుల్‌ ఇస్లాం 9 పరుగులు చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లలో మొహమ్మద్‌ సలీం సఫీ 4, యమిల్‌ అహ్మద్‌జాయ్‌ 3, ఇస్మత్‌ ఆలం 2, ఖైస్‌ అహ్మద్‌ ఒక వికెట్‌ తీశారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్‌ రెండో రోజు రెండో సెషన్‌ సమయానికి 2 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. సెదిఖుల్లా అటల్‌ 17, షహీదుల్లా కమల్‌ 20 పరుగులు చేసి ఔట్‌ కాగా.. అబ్దుల్‌ మాలిక్‌ (40), కెప్టెన్‌ రహ్మత్‌ షా (20) క్రీజ్‌లో ఉన్నారు. 

ఇదీ చదవండి: ఆస్ట్రేలియా అరుదైన రికార్డు.. 149 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement