నా అద్భుత ఫామ్‌కు కారణం అతడే: అక్షర్‌ పటేల్‌

Axar Patel credits his batting success to former Australia skipper - Sakshi

టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌పటేల్‌ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి టెస్టులో అర్దసెంచరీతో చెలరేగిన అక్షర్‌.. ఇప్పుడు రెండో టెస్టులోనే కీలక ఇన్నింగ్స్‌తో జట్టును అదుకున్నాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌తో కలిసి అక్షర్‌ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 114 ప‌రుగులు జోడించారు.

అక్షర్‌ ప‌టేల్ 115 బాల్స్‌లో మూడు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 74 ర‌న్స్ చేయ‌గా అశ్విన్ ఐదు ఫోర్లతో 31ప‌రుగులు చేశాడు. వీరిద్దరి కీలక ఇన్నింగ్స్‌ ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 263 పరుగులకు ఆలౌటైంది. ఇక తన అద్భుత ప్రదర్శన పట్ల మ్యాచ్‌ అనంతరం అక్షర్‌పటేల్‌ స్పందించాడు. తన బ్యాటింగ్ స్కిల్స్‌ మెరుగుపడడంలో  ఆసీస్‌ లెజెండ్‌ రికీ పాంటింగ్‌ కీలక పాత్ర పోషించాడు అని అతడు తెలిపాడు.

"ఐపీఎల్‌లో మా జట్టు(ఢిల్లీ క్యాపిటల్స్‌) హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నా బ్యాటింగ్‌ స్కిల్స్‌ మెరుగుపడడంలో రికీ కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా భారత జట్టులో కూడా చాలా మంది బ్యాటర్ల నుంచి బ్యాటింగ్‌ టెక్నిక్స్‌ నేర్చుకుంటున్నాను.

నా జట్టు కోసం 100 శాతం ఎఫక్ట్‌ పెడతాను. ఆల్‌రౌండర్‌గా బ్యాట్‌తో బాల్‌తో రాణించడమే నా లక్క్ష్యం. నేను సాధించే 30, 40 పరుగులను మ్యాచ్ విన్నింగ్ స్కోర్‌లుగా మలచాలి అనుకున్నాను. రాబోయే మ్యాచ్‌ల్లో కూడా నా మైండ్‌ సెట్‌ ఈ విధంగానే ఉంటుంది" అని ఎన్డీడివీతో పేర్కొన్నాడు.
చదవండి: IND Vs AUS 2nd Test: అక్షర్‌ లేకపోయుంటే.. వాళ్లకు పట్టిన గతే మనకూ!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top