ఆసీస్‌ను పడగొట్టిన పూజ | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ను పడగొట్టిన పూజ

Published Fri, Dec 22 2023 4:15 AM

Australia 219 all out in the first innings - Sakshi

ముంబై: ఆ్రస్టేలియాతో ప్రారంభమైన ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు తొలి రోజు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ముందుగా చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసిన మన బృందం ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ మెరుగైన స్థితిలో నిలిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆ్రస్టేలియా మహిళల జట్టు భారత బౌలర్ల ధాటికి  తమ తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకే ఆలౌటైంది.

భారత జట్టుపై టెస్టుల్లో ఆసీస్‌ జట్టుకిదే అత్యల్ప స్కోరు. తహీలా మెక్‌గ్రాత్‌ (56 బంతుల్లో 50; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా... బెత్‌ మూనీ (40), కెప్టెన్  అలీసా హీలీ (38), కిమ్‌ గార్త్‌ (28 నాటౌట్‌) కీలక పరుగులు సాధించారు. పేసర్‌ పూజ వస్త్రకర్‌ (4/53) నాలుగు కీలక వికెట్లు పడగొట్టగా... స్పిన్నర్లు స్నేహ్‌ రాణా 3, దీప్తి శర్మ 2 వికెట్లు తీశారు. తొలి ఓవర్లోనే లిచ్‌ఫీల్డ్‌ (0) రనౌట్‌ కాగా, అద్భుత బంతితో ఎలీస్‌ పెరీ (4)ని పూజ బౌల్డ్‌ చేయడంతో ఆసీస్‌ కష్టాల్లో పడగా... మెక్‌గ్రాత్, మూనీ మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు.

అనంతరం భారత్‌ ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోయి 19 ఓవర్లలోనే 98 పరుగులు చేసింది. స్మృతి మంధాన (49 బంతుల్లో 43 బ్యాటింగ్‌; 8 ఫోర్లు), షఫాలీ వర్మ (59 బంతుల్లో 40; 8 ఫోర్లు) ఆరంభం నుంచే దూకుడుగా ఆడి తొలి వికెట్‌కు 100 బంతుల్లోనే 90 పరుగులు జత చేశారు. ప్రస్తుతం భారత్‌ మరో 121 పరుగులు వెనుకబడి ఉంది.  

స్కోరు వివరాలు  
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: మూనీ (సి) స్నేహ్‌ రాణా (బి) పూజ 40; లిచ్‌ఫీల్డ్‌ (రనౌట్‌) 0; ఎలీస్‌ పెరీ (బి) పూజ 4; తహీలా (సి) రాజేశ్వరి (బి) స్నేహ్‌ రాణా 50; హీలీ (బి) దీప్తి 38; అనాబెల్‌ (ఎల్బీ) (బి) పూజ 16; యాష్లీ (సి) యస్తిక (బి) పూజ 11; జెస్‌ (ఎల్బీ) (బి) దీప్తి 19; అలానా కింగ్‌ (సి) యస్తిక (బి) స్నేహ్‌ రాణా 5; గార్త్‌ (నాటౌట్‌) 28; లౌరెన్‌ (సి) స్మృతి (బి) స్నేహ్‌ రాణా 6; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (77.4 ఓవర్లలో ఆలౌట్‌) 219. వికెట్ల పతనం: 1–2, 2–7, 3–87, 4–103, 5–143, 6–159, 7–160, 8–168, 9–198, 10–219. 
బౌలింగ్‌: రేణుక 7–0–35–0, పూజ వస్త్రకర్‌ 16–2–53–4, స్నేహ్‌ రాణా 22.4–4–56–3, రాజేశ్వరి 13–4–29–0, దీప్తి శర్మ 19–3–45–2. 

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: షఫాలీ (ఎల్బీ) (బి) జెస్‌ 40; స్మృతి (బ్యాటింగ్‌) 43; స్నేహ్‌ రాణా (బ్యాటింగ్‌) 4; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 98. వికెట్ల పతనం: 1–90. బౌలింగ్‌: లౌరెన్‌ 4–2–12–0, కిమ్‌ గార్త్‌ 4–0–34–0, పెరీ 4–0–31–0, యాష్లీ 5–3–8–0, జెస్‌ జొనాసెన్‌ 2–1–4–1.  

Advertisement

తప్పక చదవండి

Advertisement