Asia Cup 2023 Top Performers: ఆసియా కప్‌ 2023 టాప్‌ పెర్ఫార్మర్స్‌ వీరే..!

Asia Cup 2023 Top Performers - Sakshi

ఆసియా కప్‌ 2023 విజేతగా టీమిండియా అవతరించిన విషయం తెలిసిందే. శ్రీలంకతో నిన్న (సెప్టెంబర్‌ 17) జరిగిన ఫైనల్లో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఎనిమిదో సారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్‌ కిషన్‌ (23), శుభ్‌మన్‌ గిల్‌ (27) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. 

అంతకుముందు మహ్మద్‌ సిరాజ్‌ (7-1-21-6), బుమ్రా (5-1-23-1), హార్దిక్‌ పాండ్యా (2.2-0-3-3) చెలరేగడంతో శ్రీలంక​ 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్‌ మెండిస్‌ (17), దుషన్‌ హేమంత (13 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 

ఆసియా కప్‌ 2023 టాప్‌ పెర్ఫార్మర్స్‌ వీరే..!
2023 ఆసియా కప్‌లో టాప్‌ పెర్ఫార్మెన్స్‌లపై ఓ లుక్కేస్తే, ఈ జాబితాలో అంతా టీమిండియా ఆటగాళ్లే కనిపిస్తారు. అత్యధిక పరుగులు, అత్యధిక బౌండరీలు, అత్యధిక సిక్సర్లు, అత్యుత్తమ బౌలింగ్‌ సగటు, అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు.. ఇలా దాదాపు ప్రతి విభాగంలో భారత ఆటగాళ్లు టాప్‌లో ఉన్నారు.

  • అత్యధిక పరుగులు: శుభ్‌మన్‌ గిల్‌ (6 ఇన్నింగ్స్‌ల్లో 302 పరుగులు)
  • అత్యధిక అర్ధసెంచరీలు: రోహిత్‌ శర్మ, కుశాల్‌ మెండిస్‌ (3)
  • అత్యధిక సిక్సర్లు: రోహిత్‌ శర్మ (11)
  • అత్యధిక బౌండరీలు: శుభ్‌మన్‌ గిల్‌ (35)
  • అత్యధిక స్కోర్‌: బాబర్‌ ఆజమ్‌ (151)
  • అత్యధిక సగటు: మహ్మద్‌ రిజ్వాన్‌ (4 ఇన్నింగ్స్‌ల్లో 97.5)
  • అత్యుత్తమ స్ట్రయిక్‌రేట్‌: మహ్మద్‌ నబీ (178.95)
  • అత్యధిక వికెట్లు: మతీష పతిరణ (11)
  • అత్యుత్తమ బౌలింగ్‌ సగటు: హార్ధిక్‌ పాండ్యా (11.33)
  • అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు: మహ్మద్‌ సిరాజ్‌ (6/21)
  • టోర్నీ మొత్తంలో 7 సెంచరీలు నమోదు కాగా.. ఇందులో మూడు సెంచరీలు (కోహ్లి, రాహుల్‌, గిల్‌)  భారత ఆటగాళ్లు చేసినవే కావడం విశేషం.
Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top