
ఆసియా కప్-2023లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (సెప్టెంబర్ 12) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్‌లో 10000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ మైల్‌స్టోన్‌ను హిట్‌మ్యాన్ సిక్సర్ (285) బాది చేరుకోవడం విశేషం. వన్డే కెరీర్‌లో 241వ ఇన్నింగ్స్ ఆడుతున్న రోహిత్.. 22 పరుగుల మార్కును దాటిన తర్వాత 10000 పరుగుల క్లబ్‌లో చేరాడు.
తద్వారా సచిన్ (18426), విరాట్ (13024), గంగూలీ (11363), ద్రవిడ్ (10889), ధోని (10773) తర్వాత 10 వేల పరుగుల మార్కును అందుకున్న ఆరో భారతీయ క్రికెటర్‌గా, ఓవరాల్‌గా 15వ బ్యాటర్‌గా రోహిత్ రికార్డుల్లోకెక్కాడు. అలాగే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా (241 ఇన్నింగ్స్‌లు), ఈ ఘనత సాధించిన సాధించిన 15 మంది ఆటగాళ్లలో మూడో అత్యుత్తమ సగటు (49.02) కలిగిన బ్యాటర్‌గా పలు ఘనతలను సొంతం చేసుకున్నాడు.
The moment Rohit Sharma completed 10,000 runs in ODI.
— Johns. (@CricCrazyJohns) September 12, 2023
- What a classic shot. pic.twitter.com/spNbByjuda
కాగా, పాక్‌పై భారీ విజయం సాధించిన గంటల వ్యవధిలోనే భారత్ మరోసారి బరిలోకి దిగాల్సి వచ్చింది. వర్షం కారణంగా భారత్-పాక్ మ్యాచ్ రిజర్వ్ డేకు వాయిదా పడటంతో భారత్ వరుసగా రెండు రోజుల్లో రెండు మ్యాచ్‌లు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పాక్‌తో ఆడిన జట్టులో భారత్ ఓ మార్పు చేసింది.
శార్దూల్ ఠాకూర్‌కు విశ్రాంతినిచ్చి, అతని స్థానంలో అక్షర్ పటేల్‌కు అవకాశం ఇచ్చింది. బ్యాటర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై ధాటిగానే ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్.. 9 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. 23 పరుగులతో (2 ఫోర్లు, సిక్స్) రోహిత్, 18 పరుగులతో (2 ఫోర్లు) గిల్ క్రీజ్‌లో ఉన్నారు.