Ashes Series 2023: Steve Smith Believes England Bazball Approach Will Not Work In Front Of Them - Sakshi
Sakshi News home page

Ashes 2023: బజ్‌బాల్‌ లేదు తొక్కా లేదు.. మీ పప్పులు మా ముందు ఉడకవు.. ఇంగ్లండ్‌కు స్టీవ్‌ స్మిత్‌ వార్నింగ్‌

Jun 10 2023 1:44 PM | Updated on Jun 10 2023 3:41 PM

Ashes 2023: Steve Smith Believes England Bazball Approach Will Not Work In Front Of Them - Sakshi

టీమిండియాతో జరుగుతున్న వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్లో సెంచరీతో కదంతొక్కి, తన జట్టును పటిష్ట స్థితిలో ఉంచిన ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌.. త్వరలో ఇంగ్లండ్‌తో  ప్రారంభంకానున్న యాషెస్‌ సిరీస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మైండ్‌ గేమ్‌లో భాగంగా స్టీవ్‌.. ఇప్పటి నుంచే ఇంగ్లండ్‌ను టార్గెట్‌ చేయడం మొదలుపెట్టాడు. ఇంగ్లీష్‌ క్రికెటర్లను మానసికంగా దెబ్బకొట్టేందుకు మాటల యుద్దానికి దిగాడు.

ఇటీవలికాలంలో టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌ అవళంభిస్తున్న బజ్‌బాల్‌ అప్రోచ్‌ను తక్కువ చేస్తూ.. మాపై ఇంగ్లీష్‌ బ్యాటర్లకు అంత సీన్‌ ఉండదని విర్రవీగాడు. ఇతర జట్లపై బజ్‌బాల్‌ అప్రోచ్‌ ప్రభావం చూపి ఉంవచ్చని, మా ముందు మాత్రం వారి పప్పులు ఉడకవని గొప్పలు పోయాడు. తమ బౌలర్ల ముందు బజ్‌బాల్‌ అప్రోచ్‌ వర్కౌట్‌ కాదని ధీమా వ్యక్తం చేశాడు. ఇంకా చెప్పాలంటే తమ బౌలర్లు ఇంగ్లండ్‌ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడం ఖాయమని తెలిపాడు.

కాగా, ఇంగ్లండ్‌ బజ్‌ బాల్‌ అప్రోచ్‌ అంటూ టెస్ట్‌ల్లో వేగాన్ని పెంచింది. గడిచిన ఏడాది కాలంలో ఆ జట్టు 4.85 రన్‌రేట్‌తో పరుగులు సాధించి, 13 మ్యాచ్‌ల్లో 11 విజయాలు సాధించింది. ఇంగ్లీష్‌ టీమ్‌లోని ఐదుగురు 75కుపైగా స్ట్రయిక్‌ రేట్‌తో పరుగులు సాధించారు. ఇదే జోరును ఇంగ్లండ్‌ త్వరలో ప్రారంభంకానున్న యాషెస్‌ సిరీస్‌లో కూడా కొనసాగించాలని చూస్తుంది. అయితే, పటిష్టమైన ఆసీస్‌ బౌలింగ్‌ అటాక్‌ ముందు బజ్‌బాల్‌ అప్రోచ్‌ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చని విశ్లేషకుల అంచనా. మరి బజ్‌బాల్‌తో ఇంగ్లండ్‌ బ్యాటర్లు ఆసీస్‌పై పైచేయి సాధిస్తారో లేక ఆసీస్‌ బౌలర్లే ఎదురుదాడికి దిగి ఇంగ్లీష్‌ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడతారో వేచి చేడాలి. 

ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య ఇంగ్లండ్‌ వేదికగా జరిగే యాషెస్‌ సిరీస్‌ షెడ్యూల్‌..
తొలి టెస్ట్‌, జూన్‌ 16-20, ఎడ్జ్‌బాస్టన్‌ 
రెండో టెస్ట్‌, జూన్‌ 28-జులై 2, లార్డ్స్‌
మూడో టెస్ట్‌, జులై 6-10, హెడింగ్లే
నాలుగో టెస్ట్‌, జులై 19-23, ఓల్డ్‌ ట్రాఫర్డ్‌
ఐదో టెస్ట్‌, జులై 27-31, ఓవల్‌

చదవండి: మిగతా వారు ఏదో ఒక రకంగా పనికొచ్చారు.. నువ్వేందుకు, దండగ.. ఉమేశ్‌పై ఫ్యాన్స్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement