క్వార్టర్‌ ఫైనల్లో అల్‌కరాజ్‌ | Alcaraz in the quarter finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో అల్‌కరాజ్‌

Jul 8 2024 4:20 AM | Updated on Jul 8 2024 4:20 AM

Alcaraz in the quarter finals

లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌), ప్రపంచ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ) క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మూడో సీడ్‌ అల్‌కరాజ్‌ 6–3, 6–4, 1–6, 7–5తో ఉగో హంబెర్ట్‌ (ఫ్రాన్స్‌)పై, టాప్‌ సీడ్‌ సినెర్‌ 6–2, 6–4, 7–6 (11/9)తో బెన్‌ షెల్టన్‌ (అమెరికా)పై గెలుపొందారు. 

మరోవైపు ఏడుసార్లు చాంపియన్, రెండో ర్యాంకర్‌ జొకోవిచ్‌ (సెర్బియా) ఈ టోరీ్నలో 16వసారి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మూడో రౌండ్‌ మ్యాచ్‌లో జొకోవిచ్‌ 4–6, 6–3, 6–4, 7–6 (7/3)తో పాపిరిన్‌ (ఆస్ట్రేలియా)పై నెగ్గాడు.   

Advertisement
 
Advertisement
Advertisement