
PC: IPL.com
ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పేలవ ఫామ్ ప్రతి అభిమాని కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నదని భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2022లో కోహ్లి వరుసగా విఫలమవుతున్నాడు. శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి తొలి బంతికే డకౌటయ్యాడు. ఈ సీజన్‌లో కోహ్లి వరుసగా రెండోసారి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే చోప్రా ఇటువంటి వాఖ్యలు చేశాడు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి కేవలం 119 పరుగులు మాత్రమే సాధించాడు.
"విరాట్ కోహ్లికి ఏమైంది. కోహ్లి ఎప్పుడు పరుగులు సాధిస్తాడు. ఇకపై ఫామ్‌లోకి వస్తాడా లేదా అన్నది సందేహంగా మారింది. వరుసగా రెండు గోల్డెన్ డక్‌లు.. ఈ సీజన్‌లో రెండు సార్లు రనౌట్ అయ్యాడు. మాకు కన్నీళ్లు వస్తున్నాయి. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. రోహిత్, కోహ్లి వంటి వరకు అభిమానులు ఎక్కువగా ఉంటారు. వీరిద్దరూ త్వరలోనే ఫామ్‌లోకి రావాలని ఆశిస్తున్నాను" అని ఆకాష్ చోప్రా యూట్యాబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు. ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ కేవలం 114 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
చదవండి: IPL 2022: టీమిండియాలో చోటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హార్ధిక్ పాండ్యా