IRE vs IND: 'ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. ఆ ఇద్దరు ఆటగాళ్లకి భారత తుది జట్టులో నో ఛాన్స్‌'

Aakash Chopra prefers Deepak Hooda for Ireland T20Is - Sakshi

ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు  17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బుధవారం(జూన్‌15) బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున రాణించిన రాహుల్‌ త్రిపాఠి తొలి సారి భారత జట్టుకు ఎంపిక కగా.. సంజు శాంసన్‌ తిరిగి మళ్లీ జట్టులోకి వచ్చాడు. అయితే ఐర్లాండ్‌తో టీ20లకు భారత తుది జట్టులో రాహుల్‌ త్రిపాఠి,శాంసన్‌కు చోటు దక్కదని  భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తుది జట్టలో చోటు కోసం వీరిద్దరి కంటే ముందు దీపక్ హుడా అర్హుడని చోప్రా తెలిపాడు. 

"పంత్‌ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. కాబట్టి నాలుగో స్థానంలో ఎవరు బ్యాటింగ్‌కు వస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. పంత్‌ స్థానంలో దీపక్ హుడా అర్హుడని నేను భావిస్తున్నాను. ఓపెనర్లుగా ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్ గైక్వాడ్‌ ఉన్నారు. మూడో స్థానానికి సుర్యకుమార్‌ యాదవ్‌ సిద్దంగా ఉన్నాడు. ఇక ఐదో స్థానంలో కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా బ్యాటింగ్‌కు రానున్నాడు.

కాబట్టి రాహుల్‌ త్రిపాఠి,శాంసన్‌కు ప్లేయింగ్‌ ఎలవెన్‌లో చోటు దక్కే అవకాశం లేదు. కేవలం రెండు టీ20లు మాత్రమే భారత్‌ ఆడనుంది. రెండు టీ20లకు టీమిండియా తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఒక వేళ వీరిద్దరిలో ఎవరికైనా తుది జట్టులో చోటు దక్కి, హుడాకి దక్కకపోతే అతడు తీవ్రంగా నిరాశ చెందుతాడు. ఎందుకంటే దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపికైన అతడు గత మూడు మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమయ్యాడు" అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
చదవండిRanji Trophy 2022 : హ్యాట్రిక్ సెంచరీలతో చెలరేగిన యశస్వి జైస్వాల్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top