రింకూ సింగ్.. ప్రపంచ టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్లలో ఒకడు. మరోసారి అతడిలోని ఫినిషర్ బయటకు వచ్చాడు. ఐపీఎల్-2026 సీజన్‌లో ఆదివారం ఏకానా స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
తన సూపర్ బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో కేకేఆర్‌కు సంచలన విజయాన్ని అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ కేవలం 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో రింకూ వీరోచిత పోరాటం కనబరిచాడు. చివరి రెండో ఓవర్లలో రింకూ లక్నో బౌలర్లను ఉతికారేశాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్ వేసిన స్పిన్నర్ దిగ్వేష్ రాఠీకి ఈ యూపీ క్రికెటర్ చుక్కలు చూపించాడు.
వరుసగా నాలుగు సిక్స్‌లు బాది ఐపీఎల్-2023 సీజన్‌ను రింకూ గుర్తు చేశాడు. ఆఖరి బంతిని రింకూ మిస్స్ చేసుకున్నాడు. లేదంటే మూడేళ్ల కిందట సీన్ రిపీట్ అయ్యి ఉండేది. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌ను సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికి మర్చిపోడు.
గుజరాత్ విజయానికి చివరి ఓవర్‌లో 29 పరుగులు అవసరమవ్వగా.. రింకూ వరుసగా ఐదు సిక్స్‌లు బాది తమ జట్టును విజయతీరాలకు తేచ్చాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఆఖరి ఓవర్‌లో ఇన్ని పరుగులు ఛేజ్ చేయడం అదే మొదటిసారి. అప్పటిలో రింకూ ఇన్నింగ్స్‌పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
"టీ20 క్రికెట్ చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదు. ఆఖరి ఓవర్‌లో ఇన్ని పరుగులు చేయడం అంత సులుభం కాదు. విజయానికి 5 సిక్సర్లు కావాల్సినప్పుడు రింకూ ఇలా చేయడం నిజంగా అద్భుతం. కానీ రింకూ సింగ్ మళ్ళీ ఎప్పటికీ దీన్ని రిపీట్ చేయలేడు" అని క్రిక్‌బజ్ లైవ్ షోలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. అయితే సెహ్వాగ్ అంచనా తప్పిందని నెటిజన్లు అంటున్నారు. రింక్ దాదాపుగా మరోసారి చివరి ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టేంత పనిచేశాడని పోస్ట్‌లు పెడుతున్నారు.
చదవండి: Virender Sehwag: వైభవ్, శ్రేయస్ కాదు.. ఎవరికీ టీమిండియాలో చోటు లేదు
RINKU SINGH SMASHED 4 SIXES IN THE FINAL OVER AGAINST DIGVESH RATHI.
- An iconic 83* (50) by Rinku. pic.twitter.com/V6dFUvtBWl— Mufaddal Vohra (@mufaddal_vohra) April 26, 2026


