2024 Japanese Grand Prix: వెర్‌స్టాపెన్‌కు మూడో విజయం | Sakshi
Sakshi News home page

2024 Japanese Grand Prix: వెర్‌స్టాపెన్‌కు మూడో విజయం

Published Mon, Apr 8 2024 6:33 AM

2024 Japanese Grand Prix: Verstappen crosses the line to take his third victory of the season - Sakshi

సుజుకా (జపాన్‌): జపాన్‌ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ రేసులో రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఈ రేసును వెర్‌స్టాపెన్‌ ‘పోల్‌ పొజిషన్‌’తో ప్రారంభించాడు. నిరీ్ణత 53 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంటా 54 నిమిషాల 23.566 సెకన్లలో పూర్తి చేసి ఈ నెదర్లాండ్స్‌ డ్రైవర్‌ అగ్రస్థానాన్ని దక్కించుకొని కెరీర్‌లో 57వ టైటిల్‌ను సాధించాడు.

ఈ సీజన్‌లో వెర్‌స్టాపెన్‌కిది మూడో విజయంకాగా... జపాన్‌ గ్రాండ్‌ప్రిలో వరుసగా మూడో గెలుపు కావడం విశేషం. రెడ్‌బుల్‌ జట్టుకే చెందిన సెర్జియో పెరెజ్‌ రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో నాలుగు రేసుల తర్వాత వెర్‌స్టాపెన్‌ 77 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... 64 పాయింట్లతో పెరెజ్‌ రెండో స్థానంలో, 59 పాయింట్లతో లెక్‌లెర్క్‌(ఫెరారీ) మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని ఐదో రేసు చైనా గ్రాండ్‌ప్రి ఈనెల 21న జరుగుతుంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement