వైరల్‌: పాము ఆట కట్టించి ఔరా అనిపించిన మాజీ మంత్రి

Maharashtra Former Minister Girish Mahajan Catches Snake - Sakshi

ముంబై: నిత్యం వివాదాస్పద చర్యలతో వార్తల్లో ఉండే బీజేపీ సీనియర్‌ నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి గిరీశ్‌ మహాజన్‌ పాము ఆట కట్టించి ఔరా అనిపించారు. ప్రజల మధ్యకు వచ్చిన పామును స్వయంగా చేతితో పట్టి బయటకు వదిలేశాడు. ఈ చర్య సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని జమ్నీర్‌ పట్టణంలో మంగళవారం సాయంత్రం జనబాహుళ్యంలోకి అకస్మాత్తుగా పాము ప్రత్యక్షమైంది. గుడి వెనుకాల పాము కనపడడంతో కలకలం రేపింది. భయంతో పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడి ఉన్నారు.


పామును పట్టుకుంటున్న మాజీ మంత్రి గిరీశ్‌ మహాజన్‌

విషయం తెలుసుకున్న మాజీ మంత్రి గిరీశ్‌ మహాజన్‌ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అందరినీ పక్కకు జరిపి పాము వద్దకు ఆయన వెళ్లారు. అమాంతం ఐదడుగుల పామును స్వయంగా చేతితో పట్టుకున్నారు. తమ నాయకుడు పామును చాకచక్యంగా పట్టుకోవడంతో అక్కడ ఉన్నవారంతా కేరింతలు కొట్టారు. ఆయన సాహసాన్ని అందరూ మెచ్చుకున్నారు. పామును పట్టుకుంటున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన పాములకు స్నేహితుడు. పాములను పట్టుకుంటూ వాటిని ఆట పట్టిస్తూ ఉంటాడు. గతంలో ఎన్నో పాములు పట్టుకున్నారు. అయితే తాజాగా జన బాహుళ్యంలో నాయకుడి తెగువను చూసి నెటిజన్లు అభినందిస్తున్నారు. గిరీశ్‌ మహాజన్‌ మహారాష్ట్రలో కీలక నేత. బీజేపీలో సీనియర్‌ నాయకుడిగా కొనసాగుతున్నారు. అతడిపై గతంలో పలు కేసులు నమోదై ఉన్నాయి.
 

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top