యూపీఐ చార్జీలను ఉపసంహరించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

యూపీఐ చార్జీలను ఉపసంహరించుకోవాలి

Sep 27 2026 2:15 PM | Updated on Sep 27 2026 2:15 PM

సిద్దిపేటకమాన్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూపీఐ చార్జీల విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏఐవైఎఫ్‌ నాయకుడు డిమాండ్‌ చేశారు. అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో యూపీఐ చార్జీలు ఉపసంహరించాలని డిమాండ్‌ చేస్తూ సిద్దిపేట మోడ్రన్‌ బస్టాండ్‌లో శనివారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త రుసుం విధానం వల్ల భవిష్యత్‌లో చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న యువతపై పడే ఆర్థిక ప్రభావంపై స్పష్టమైన హామీ, పారదర్శకత అవసరమన్నారు. యూపీఐ చార్జీల బిల్లును తీసుకొస్తే చిరు వ్యాపారులు, సామాన్య ప్రజలపై భారంపడే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement