న్యూస్‌రీల్
అక్క ఆమెరికాలో ఉద్యోగం..చెల్లి డాక్టర్
కూతుళ్లని కృంగిపోలేదు: తల్లిదండ్రులు
కథనాలు.. 8లో..
మట్టిలో మాణిక్యాలు
గర్వంగా ఉంది
ఇద్దరూ కూతుళ్లు పుట్టారని ఎన్నడూ బాధపడలేదు. మేము చదువుకోకున్నా పిల్లలను చక్కగా చదివించేందుకు వ్యవసాయం చేస్తూ ఎంతో కష్టపడ్డాం. మేము కన్న కలలను నిజం చేసిన కూతుళ్లను చూసి గర్వ పడుతున్నాం.
–విజయేందర్‌రెడ్డి, తండ్రి, పాలమాకుల
నంగునూరు(సిద్దిపేట): వ్యవసాయ కుటుంబంలో పుట్టిన అక్కా చెల్లెళ్లు మట్టిలో మాణిక్యాలుగా నిలిచారు. తాము పెద్దగా చదువుకోకున్నా తమ పిల్లల భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దాలని వారి తల్లిదండ్రుల కలల్ని నిజం చేశారు. రిటైర్డు హెచ్‌ఎంగా పని చేసిన తాతయ్యను స్ఫూర్తిగా తీసుకుని అక్క అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా..చెల్లి ఎంబీబీఎస్ పూర్తి చేసి నీట్‌లో మంచి ర్యాంక్ సాధించి ఆదర్శంగా నిలిచింది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులకు చెందిన ఎల్లంకి విజయేందర్‌రెడ్డి, రజినీకి ఇద్దరు కూతుళ్లు. తనకున్న 4.30 ఎకరాల భూమితో పాటు తన తల్లిదండ్రుల భూమి కలిపి వ్యవసాయం చేస్తూ ఇద్దరు కూతుళ్లను చదివించారు. పెద్ద కూతురు శ్రీలక్ష్మి బీఫార్మసీ చేసి అమెరికా వెళ్లి ఎమ్‌ఎస్ పూర్తి చేసి అలబామాలో ఉద్యోగం చేస్తోంది. చిన్న కూతురు శ్రీప్రియ కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. నీట్‌పీజీ పరీక్షలో 10,109 ర్యాంక్ సాధించింది. రాష్ట్ర ర్యాంక్ ప్రకటిస్తే తెలంగాణలో సీటు వచ్చే అవకాశముందని, కార్డియాలజిస్ట్ కావాలని ఉందని శ్రీప్రియ చెప్పారు.


