తెలుగులో వెనుకంజ | - | Sakshi
Sakshi News home page

తెలుగులో వెనుకంజ

Sep 27 2026 2:15 PM | Updated on Sep 27 2026 2:15 PM

తెలుగు చదవడం కంటే రాయడంలో ముందు తెలుగు, ఇంగ్లిషు, గణితంలో పరీక్షలు పలు పాఠశాలల్లో ఏకోపాధ్యాయులు

గణితంలో ముందంజ..
బేస్‌లైన్‌–2026లో రాష్ట్రంలో జిల్లాకు 11వ స్థానం
తెలుగు చదవడం కంటే రాయడంలో ముందు

జిల్లావ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలు 674 ఉండగా ఇందులో 29,372 విద్యార్థులు చదువుతున్నారు. ఈ బేస్‌లైన్‌ టెస్ట్‌కు 19,209(65.4%) మంది హాజరయ్యారు. ప్రతీ ఏటా విద్యాశాఖ ఎఫ్‌ఎల్‌ఎన్‌(ఫండమెంటల్‌ లిటరసీ న్యూమరసీ) కార్యక్రమం కింద విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసి వారి నైపుణ్యాల మెరుగుకు చర్యలు తీసుకుంటోంది. తొలుత ఆగస్టులో బేస్‌లైన్‌, నవంబర్‌లో మిడ్‌లైన్‌, మార్చిలో ఎండ్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బోధించే ఉపాధ్యాయులే పరీక్షలు నిర్వహించి వారే ట్యాబ్‌లో ఫలితాలు నమోదు చేస్తున్నారు.

విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిషు రాయడం, చదవడం, గణితంలో కూడికలు, తీసివేతలు చేయడంపై పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో విద్యార్థులు కనీసం ప్రమాణాలు అందుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఇంగ్లిషుతో పోలిస్తే తెలుగు చదవడం, రాయడంలో వెనుకబడి ఉన్నారు. గణితంలో ఎక్కువగా కూడికలు చేస్తుండగా తీసివేతల్లో తక్కువ ప్రతిభ కనబర్చారు. తెలుగులో చదవడం కంటే రాయడంలో ముందు వరుసలో ఉన్నారు.

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో దాదాపు 632 మంది ఉపాధ్యాయులు కొరత ఉన్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలల దృష్ట్యా విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడటం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకే చోట ఐదు తరగతులకు బోధన చేయడం ఇబ్బందికరంగా మారిందనే మాట ఉపాధ్యాయుల నోట వినిపిస్తోంది. ఇది ఫలితాలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ మూడు రకాల అంచనాల ద్వారా పురోగతిని పరిశీలించనున్నారు. వార్షిక పరీక్షల నాటికి విద్యార్థులను తరగతి స్థాయికి తీసుకురావడం, కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు.

మీ ప్రాంతాల్లోని పాఠశాలలో విద్యార్థులు ఎలా చదువుతున్నారని ఉపాధ్యాయులను అడిగితే మంచిగానే చదువుతున్నారు అంటారు. కానీ అదంతా నిజం కాదని బేస్‌లైన్‌ టెస్ట్‌ల్లో వెల్లడైంది. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు అంచనావేసేలా ఆగస్టులో నిర్వహించిన బేస్‌లైన్‌ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. ఈ ఫలితాల్లో జిల్లాకు రాష్ట్రస్థాయిలో 11వ స్థానానికి పరిమితమైంది. విచిత్రమేటంటే మాతృభాష తెలుగులో విద్యార్థులు వెనుకబడగా కఠినంగా భావించే గణితంలో మాత్రం

ముందంజలో ఉన్నారు.

– సాక్షి, సిద్దిపేట

మరింత మెరుగు పడేందుకు కృషి చేస్తాం

విద్యార్థుల సామర్థ్యాలు మరింత మెరుగుపడే విధంగా కృషి చేస్తాం. త్వరలో జరిగే మిడ్‌లైన్‌ టెస్ట్‌లో రాష్ట్రంలోనే మొదటిస్థానం నిలిచేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతాం.

– రమేశ్‌, ఇన్‌చార్జి, డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement